Share News

Viral: ఇది ఏటీఎం కార్డు కాదండోయ్.. నిజంగా పెళ్లి కార్డే.. ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..!

ABN , First Publish Date - 2023-12-01T19:01:46+05:30 IST

తమ పెళ్లి గురించి పది మందీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన ప్రయోగాలన్నీ చేస్తుంటారు. ఇంకొందరు శుభలేఖల దగ్గర నుంచి ప్రతీదీ వినూత్నంగా డిజైన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు లక్షలు ఖర్చు చేసి పెళ్లి కార్డులను వినూత్న రీతిలో ముద్రిస్తుంటారు. ఇలాంటి ...

Viral: ఇది ఏటీఎం కార్డు కాదండోయ్.. నిజంగా పెళ్లి కార్డే.. ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా..!

తమ పెళ్లి గురించి పది మందీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్రమైన ప్రయోగాలన్నీ చేస్తుంటారు. ఇంకొందరు శుభలేఖల దగ్గర నుంచి ప్రతీదీ వినూత్నంగా డిజైన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు లక్షలు ఖర్చు చేసి పెళ్లి కార్డులను వినూత్న రీతిలో ముద్రిస్తుంటారు. ఇలాంటి విచిత్రమైన పెళ్లి కార్డుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఏటీఎం తరహాలో ముద్రించిన పెళ్లి కార్డు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు వినూత్నంగా (Innovative Wedding Cards) ఉండాలని భావించాడు. ఇందుకోసం చివరకు వినూత్నంగా ఆలోచించి, ఏటీఎం తరహాలో ముంద్రించాడు. అచ్చం ఏటీఎం కార్డు (ATM card) తరహాలోనే తయారు చేయించి, దానిపై ఓ వైపు వధూరుల పేర్లు ముద్రించాడు. మరో వైపు వివాహ తేదీ, కళ్యాణమంటపం తదితర వివారలను ముద్రించారు. ఈ పెళ్లి కార్డును చూస్తే అచ్చం ఏటీఎం కార్డులాగే ఉండడంతో అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Viral Video: బండరాయి పైనుంచి కింద పడిపోతున్న కుర్రాడు.. కాపాడేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నాలు.. చివరకు ఏం జరిగిందంటే..!

itsallaboutcards అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (Instagram) ఈ వీడియోలను షేర్ చేశారు. అలాగే ఈ ఖాతాలో వినూత్న వివాహ శుభలేఖలకు సంబంధించిన వీడియోలు మరిన్ని ఉన్నాయి. పెన్నులో ఇమిడిపోయే పెళ్లి కార్డులు, పాస్‌పోస్టు తరహాలో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ వీడియోలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! చాలా వెరైటీగా ఉందీ ఐడియా’’.. అంటూ కొందరు, ‘‘ఏటీఎం కార్డుల రూపంలో పెళ్లి కార్డులు.. సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ కార్డులకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-12-01T19:01:51+05:30 IST