Share News

Viral Video: రైల్లో యువతి వద్ద యువకుడి వింత నిర్వాకం.. చివరకు ఇద్దరూ కలిసి చేసిన పనికి ప్రయాణికులు షాక్..

ABN , First Publish Date - 2023-11-30T17:34:27+05:30 IST

ఇటీవల ప్రేమికులు చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తూ ఉన్నాం. కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఏకంగా వివాహాలే చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా...

Viral Video: రైల్లో యువతి వద్ద యువకుడి వింత నిర్వాకం.. చివరకు ఇద్దరూ కలిసి చేసిన పనికి ప్రయాణికులు షాక్..

ఇటీవల ప్రేమికులు చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తూ ఉన్నాం. కొందరు ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఏకంగా వివాహాలే చేసుకుంటున్నారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కదులుతున్న రైల్లో ఓ యువకుడు ఉన్నట్టుండి యువతి వద్దకు వెళ్లి ప్రవర్తించిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

పశ్చిమబెంగాల్ (West Bengal) అసన్సోల్ రైల్వే స్టేషన్ నుండి జాసిదిహ్ రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు బోగీలో ప్రయాణికులు రద్దీగా ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు సడన్‌గా పైకి లేచి ఎదురుగా ఉన్న యువతి వద్దకు వెళ్లాడు. అతడు రాగానే ఆమె కూడా పైకి లేచి నిలబడింది. చేతిలో హారాన్ని పట్టుకున్న అతను కాసేపు ఆమెతో ఏదో మాట్లాడతాడు. తర్వాత యువతిని (young woman) సీట్లో కూర్చోబెట్టి.. తాళి కట్టిన తరహాలో మెడలో హారాన్ని వేస్తాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. అయితే వారిద్దరూ ఇష్టపూర్వకంగా ఈ పని చేయడంతో చేసేదేమీ లేక అంతా వారికి సపోర్ట్ చేస్తారు.

Psycho Killer: ఒకరి తర్వాత మరొకరు.. వరుసగా 9 మంది మహిళల హత్య.. సైకో కిల్లర్ కోసం 250 గ్రామాల్లో సెర్చింగ్..!

యువతి పక్కన కూర్చున మహిళ.. బ్యాగులోంచి దండలు తీసి, వారిద్దరి చేతికి ఇస్తుంది. పక్కన ఉన్న ప్రయాణికుల సూచన మేరకు యువతీయువకులు దండలు మార్చుకుంటారు. తర్వాత యువతి తన ప్రియుడి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటుంది. ఈ ఘటనను అక్కడున్న వారంతా తమ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి వివాహం రా.. బాబోయ్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ మరికొందరు, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Cheapest Market: దేశంలోనే ఛీపెస్ట్ మార్కెట్ ఇదే.. 5 జతల లెదర్ షూలు కేవలం 500 రూపాయలేనట..!

Updated Date - 2023-11-30T17:36:06+05:30 IST