Share News

Cheapest Market: దేశంలోనే ఛీపెస్ట్ మార్కెట్ ఇదే.. 5 జతల లెదర్ షూలు కేవలం 500 రూపాయలేనట..!

ABN , First Publish Date - 2023-11-28T15:14:59+05:30 IST

దుస్తులు, చెప్పుల ధరలు ప్రాంతాన్ని బట్టి.. విక్రయించే స్థలాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లలో ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బ్రాండెడ్ వస్తువుల ధరలు వేలు, లక్షల్లో కూడా ఉండడం చూస్తూ ఉంటాం. అయితే...

Cheapest Market: దేశంలోనే ఛీపెస్ట్ మార్కెట్ ఇదే.. 5 జతల లెదర్ షూలు కేవలం 500 రూపాయలేనట..!

దుస్తులు, చెప్పుల ధరలు ప్రాంతాన్ని బట్టి.. విక్రయించే స్థలాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లలో ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బ్రాండెడ్ వస్తువుల ధరలు వేలు, లక్షల్లో కూడా ఉండడం చూస్తూ ఉంటాం. అయితే దేశంలోనే అత్యంత ఛీపెస్ట్ మార్కెట్ ఒకటుందనే విషయం చాలా మందికి తెలీదు. ఈ మార్కెట్‌లో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 5జతల లెదర్ షూలు కేవలం రూ.500 లోపే వస్తాయట. ఈ మార్కెట్‌కు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యూపీలోని (UP Agra) ఆగ్రాను షూ పరిశ్రమల హబ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ తయారైన షూలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీల బ్రాండెడ్ షూలు (Branded shoes) ఇక్కడ తయారవుతుంటాయి. ఇక్కడ తయారైన షూలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇదిలావుండగా, ఒక్కడి కంపెనీల్లోని షూలను కొందరు చిరు వ్యాపారులు.. హోల్‌సేల్ ధరకు కొని స్థానిక పవర్ హౌస్ ప్రాంతంలోని సంతలో విక్రయిస్తుంటారు. వారంతో శుక్ర, సోమవారాల్లో ఉదయం 5గంటల నుంచే సంత ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫార్మల్ లెదర్ షూలతో పాటూ ఆఫీస్ షూస్, స్పోర్ట్స్ షూలు తదితరాలన్నీ రూ.100 నుంచి రూ.500లోపే లభిస్తుంటాయి.

Viral: ఇలాంటి మహిళా పోలీసును ఎక్కడా చూసుండరు.. పసికందు ఏడుపు ఆపడానికి ఈమె ఏం చేసిందో తెలిస్తే..

shoes-Price.jpg

అలాగే ఈ సంతలో స్లిప్లర్స్, వివిధ రకాల మోడల్స్ చెప్పులు, లెదర్ బెల్ట్‌లు, పర్సులు తదితరాలన్నీ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ సంతలో షూలతో పాటూ షూల తయారీకి కావాల్సిన మెటీరియల్స్ కూడా లభిస్తాయి. దేశ, విదేశాల నుంచి ఆగ్రాకు పర్యాటకులు.. ఈ సంతను విధిగా సందర్శిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంతకు వందల ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు. రూ.100కి కూడా మంచి బ్రాండెడ్ షూలు లభిస్తాయని చెబుతున్నారు. అయితే వ్యాపారులతో బేరం చేసుకునే పద్ధతిని బట్టి రేటు మారుతుంటుందని గుర్తుంచుకోవాలి. కాగా, ఈ సంతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఎలా వస్తాయ్ సామీ ఇలాంటి ఐడియాలు.. బైక్ సాయంతో బావిలోంచి నీళ్లను ఎలా బయటకు తెస్తున్నారో చూస్తే..!

Updated Date - 2023-11-28T15:20:53+05:30 IST