Share News

School Children: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు.. పొలాల్లోకి వెళ్లి నాలుగే నాలుగు ఫొటోలతో నెట్టింట పెద్ద చర్చే పెట్టారుగా..!

ABN , First Publish Date - 2023-11-25T18:29:33+05:30 IST

కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ఘటనలు కూడా సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంటాయి. అలాగే కొందరు తాము చెప్పాలనుకున్న సందేశాన్ని మాటల ద్వారా కాకుండా విభిన్న పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంటారు. ఇలాంటి ప్రయత్నం కొన్నిసార్లు అందరినీ ఆలోచింపజేస్తుంటుంది. ఇలాంటి..

School Children: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు.. పొలాల్లోకి వెళ్లి నాలుగే నాలుగు ఫొటోలతో నెట్టింట పెద్ద చర్చే పెట్టారుగా..!

కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ఘటనలు కూడా సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంటాయి. అలాగే కొందరు తాము చెప్పాలనుకున్న సందేశాన్ని మాటల ద్వారా కాకుండా విభిన్న పద్ధతుల్లో వ్యక్తపరుస్తుంటారు. ఇలాంటి ప్రయత్నం కొన్నిసార్లు అందరినీ ఆలోచింపజేస్తుంటుంది. ఇలాంటి సందేశాత్మక ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పిల్లలంతా కలిసి పొలాల్లోకి వెళ్లి నాలుగు నాలుగు ఫొటోలతో నెట్టింట పెద్ద చర్చకే తెరలేపారు.

సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు (Viral photos) తెగ వైరల్ అవుతోంది. వరకట్న వేధింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం ఎంతో మంది మహిళలు ఈ సమస్య కారణంగా నిత్యం నరకయాతన అనుభవిస్తుంటారు. చాలా మంది కట్నం (dowry) తీసుకోవడం నేరమంటూ ప్రకటనలు ఇస్తుంటారు గానీ.. వారు మాత్రం ఆచరించరు. మరోవైపు ఎంత మంది మేధావులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి సమయాల్లో కొన్ని సార్లు కొందరు సమాజానికి (Innovative messages) వినూత్న రీతిలో సందేశాలు పంపిస్తుంటారు.

Indian Railway: చెప్పు తీసుకుని ఓ కుర్రాడిని చితకబాదిన యువతి.. రైల్లో అందరూ చూస్తుండగానే..!

photo.jpg

తాజాగా, కొందరు పిల్లలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. చాలా మంది స్కూలు విద్యార్థులు.. పొలాల్లోకి వెళ్లి.. ‘‘కట్నం తీసుకోవడం పాపం’’.. అనే హిందీ అక్షరాల ఆకారంలో కూర్చుని అందరికీ వినూత్నంగా సందేశం ఇచ్చారు. ఈ అక్షరాలకు సంబంధించిన నాలుగు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల ప్రయత్నాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఉద్యోగం చేస్తున్న అమ్మాయి... నిరుద్యోగ యువకుడిని వివాహం చేసుకుంటారా’’.. అంటూ కొందరు, ‘‘యువకులతో పాటూ యువతులు కూడా పాటించాలి’’.. అని మరికొందరు, ‘‘విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. అభినందనీయం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Death Mystery: ఒకేసారి నలుగురు పిల్లల మృతి.. కరెంట్ షాక్‌తో చనిపోయారనుకున్న తల్లి.. పోస్ట్‌మార్టం రిపోర్టులో షాకింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-11-25T18:30:49+05:30 IST