Share News

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

ABN , First Publish Date - 2023-11-24T18:32:57+05:30 IST

రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇక మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. తాజాగా...

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇక మహిళలకైతే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా మంది ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. తాజాగా, రాజస్థాన్‌కు చెందిన ఓ మహిలకు రైల్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముగ్గురు కుర్రాళ్లు అర్ధరాత్రి వేళ రైల్లో మందు పార్టీ చేసుకున్నారు. వెనక సీట్లో కూర్చున సదరు మహిళకు విసుగొచ్చి చివరకు ఏం చేసిందంటే..

రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రి బిష్ణోయ్‌ అనే మహికుల రైల్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. నవంబర్ 20న రాత్రి ఆమె జలావర్ సిటీ నుంచి శ్రీగంగానగర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైల్లో (Express train) ప్రయాణిస్తోంది. అయితే వేకువజాము 2గంటల సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ముగ్గురు యువకులు.. ఆమె కూర్చున్న సీటు వెనుక వైపు మద్యం సేవిస్తూ పక్కన ఉన్న ప్రయాణికులతో గొడవకు దిగారు. అడ్డు వచ్చిన వారందరినీ (youth misbehaved with the passengers) దుర్భాషలాడడం మొదలెట్టారు. దీంతో గాయత్రి తీవ్ర అసౌకర్యానికి గురైంది. అయితే ఆ సమయంలో బోగీలో పోలీసులు ఎవరూ లేకపోవడం చూసి ఆమె అవాక్కయింది. చివరకు టీటీఈకి విషయం తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. చాలా సేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

Viral Video: 9 అడుగుల వెడల్పులో ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టారబ్బా..? ప్రపంచంలోనే ఇదో వింత..!

రైల్లో చోటు చేసుకున్న ఘటనను వీడియో తీసిన గాయత్రి.. తర్వాత రోజు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె రైల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపుతూ ఆరోపణలే చేసింది. కాగా, ఈ వీడియోపై రైల్వే అధికారి ఒకరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా.. సదరు మహిళ విమర్శించడం బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అయితే జలావర్ సిటీ నుంచి శ్రీరంగానగర్ మధ్యలో సిబ్బందిని నియమించలేదంటూ ఆర్పీఎఫ్ (RPF) అంగీకరించింది. రైల్లో జరిగిన ఘటనపై గాయత్రి మాట్లాడుతూ.. పోలీసులు రావడానికి చాలా సమయం పట్టిందని, ఆ సమయంలో నిందితులు ప్రమాదం తలపెడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పోలీస్ స్టేషన్ ముందు స్కూటీని ఆపి.. ఓ మహిళ వింత నిర్వాకం.. డబ్బుల్ని నడిరోడ్డుపై విసిరేస్తూ..!

Updated Date - 2023-11-24T18:32:59+05:30 IST