Share News

Google Pay: గూగుల్ పే యాప్‌తో మొబైల్ రీచార్జ్ చేసుకుంటున్నారా..? తాజాగా వచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-11-24T15:17:15+05:30 IST

ఉప్పు నుంచి పప్పు దాకా, రూపాయి నుంచి వేల రూపాయల ట్రాన్సక్షన్ వరకూ ఏది చేయాలన్నా... ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం వంటి యాప్‌ల ద్వారానే చేయడం సర్వసాధారణమైంది. యూజర్లను ఆకట్టుకునేందుకు సదరు యాప్‌ల అనేక ఆఫర్లు కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు...

Google Pay: గూగుల్ పే యాప్‌తో మొబైల్ రీచార్జ్ చేసుకుంటున్నారా..? తాజాగా వచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే..!

ఉప్పు నుంచి పప్పు దాకా, రూపాయి నుంచి వేల రూపాయల ట్రాన్సక్షన్ వరకూ ఏది చేయాలన్నా... ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం వంటి యాప్‌ల ద్వారానే చేయడం సర్వసాధారణమైంది. యూజర్లను ఆకట్టుకునేందుకు సదరు యాప్‌ల అనేక ఆఫర్లు కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు ట్రాన్సక్షన్ చేసినందుకు గానూ రివార్డుల పేరుతో క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు కూడా ఇస్తుంటారు. అయితే రాను రాను క్యాష్ బ్యాక్ ఆఫర్లు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గూగుల్ పే యాప్.. తమ యూజర్లకు మరో షాక్ ఇచ్చింది. మొబైల్ రీచార్జ్ చేసుకునేవారికి.. తాజాగా వచ్చిన ఓ షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే..!

ప్రస్తుత పరిస్థితుల్లో రీచార్జ్ చేసే వారు ఎవరైనా టక్కున ఫోన్ పే ద్వారానే, గూగుల్ పే ద్వారానో చేసేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇలా మొబైల్ రీచార్జ్ చేసే వారికి Google Pay యాప్ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో మొబైల్ రీచార్జ్‌కు (Mobile Recharge) ఎలాంటి అదనపు చార్జీలు ఉండేవి కావు. కానీ గూగుల్ పే యాప్‌లో ప్రస్తుతం మొబైల్ రీచార్జ్‌పై అదనపు చార్జీలు విధిస్తున్నారు. ఈ అదనపు చార్జీని (Additional charge) కన్వీనియన్స్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అలాగే ఇందులోనే జీఎస్టీని కూడా చేర్చారు. రూ.749లు రీచార్జ్‌పై రూ.3లు చార్జీ వసూలు చేస్తున్నట్లు ఓ నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.749తో రీచార్జ్ చేసుకుంటే మొత్తం రూ.752లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కన్వీనియన్స్ ఫీజు కింద జీరో నుంచి రూ.100 రీచార్జ్‌పై ఎలాంటి చార్జీ ఉండదు.

Viral News: పాపం.. ఈ విమానం ఎక్కిన వాళ్ల పరిస్థితి ఏంటో.. కుక్కలకు పెట్టే ఆహారాన్నే ప్రయాణీకులకు కూడా..!

అలాగే రూ.101 నుంచి రూ.200 మధ్య రీచార్జ్‌పై రూ.1 కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారు. అలాగే రూ.201లు నుంచి రూ.300లు మధ్య రీచార్జ్‌పై రూ.2లు వసూలు చేస్తారు. రూ.301లు ఆపైన రీచార్జ్‌పై రూ.3లు చార్జీ వసూలు చేస్తున్నారు. అయితే మొబైల్ రీచార్జ్ మినహా ఇతర లావాదేవీలపై Google Pay ఎలాంటి చార్జీలు విధించలేదు. అదేవిధంగా కరెంట్ బిల్లులు, ఇతర రీచార్జ్‌లపై కూడా ఎలాంటి ఫీజులూ వసూలు చేయలేదు. అయితే మొబైల్ రీచార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజును గూగుల్ పే.. దశలవారీగా అమలు చేస్తోంది. గూగుల్ పే యాప్‌కు ప్రస్తుతం 60 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీజు అమలవుతుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, మొబైల్ రీచార్జ్‌లపై కన్వీనియన్స్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు Google Pay అధికారికంగా ప్రకటించలేదు.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ దెబ్బకు.. ఆ కంపెనీయే దివాళా తీసేట్టుందిగా.. ఆటో వెనుక అసలేం రాశాడో చూస్తే..!

Updated Date - 2023-11-24T15:17:52+05:30 IST