Share News

Viral Video: రూ.500 నోట్లతో గజమాల.. పెళ్లిలో సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ వరుడు ఎవరో కానీ లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా..!

ABN , First Publish Date - 2023-11-22T19:36:56+05:30 IST

వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పట్లో పక్కింటి, పొరుగింటి వారి దృష్టిలో గొప్పలా ఉండాలనే ఉద్దేశంతో వివాహాలను ఘనంగా జరిపించేవారు. ప్రస్తుతం నెట్టింట్లో తమ గురించి అంతా గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వివాహాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో...

Viral Video: రూ.500 నోట్లతో గజమాల.. పెళ్లిలో సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఈ వరుడు ఎవరో కానీ లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా..!

వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పట్లో పక్కింటి, పొరుగింటి వారి దృష్టిలో గొప్పలా ఉండాలనే ఉద్దేశంతో వివాహాలను ఘనంగా జరిపించేవారు. ప్రస్తుతం నెట్టింట్లో తమ గురించి అంతా గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వివాహాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి ఓ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 20లక్షల రూ.500ల నోట్లతో వరుడికి గజమాల తయారు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యారో.. ఏమో తెలీదు గానీ.. వరుడికి వినూత్నంగా తయారు చేసిన గజమాల వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.500ల నోట్లను తీసుకున్నారు. అది కూడా సుమారు రూ.20లక్షల విలువైన నోట్లను తీసుకుని అత్యంత (Garland made of currency notes) పొడవైన గజమాలను తయారు చేశారు. మాలను సిద్ధం చేసిన తర్వాత.. వరుడిని గోడపై నిలబెట్టి అతడి మెడలో వేశారు.

Funny Video: ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న ప్రియుడు.. అటుగా వెళ్తూ చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

గోడ పైనుంచి కింద నేలపై చాలా దూరం వరకూ మాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ విచిత్రమైన గజమాలను చూసి అంతా అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకించారు. గజమాలతో ఉన్న వరుడిని చాలా మంది తమ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఈ వరుడు లక్కీ ఛాన్స్ కొట్టాడుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ‘‘జాగ్రత్త.. ఎవరైనా లాక్కుని వెళ్లగలరు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

Updated Date - 2023-11-22T19:40:10+05:30 IST