Share News

Viral: ఇద్దరు పోలీసులకు వింత శిక్ష.. గడ్డి కోయండంటూ హైకోర్టు ఆదేశాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-11-22T16:53:04+05:30 IST

కోర్టుల్లో కేసు విచారణ సందర్భాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతుంటాయి. మరికొన్ని కేసుల్లో విచారణ త్వరగా పూర్తవుతుంటుంది. అయితే మరోవైపు కొన్ని కేసుల్లో...

Viral: ఇద్దరు పోలీసులకు వింత శిక్ష.. గడ్డి కోయండంటూ హైకోర్టు ఆదేశాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!
ప్రతీకాత్మక చిత్రం

కోర్టుల్లో కేసు విచారణ సందర్భాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని కేసులు ఏళ్ల తరబడి కొనసాగుతుంటాయి. మరికొన్ని కేసుల్లో విచారణ త్వరగా పూర్తవుతుంటుంది. అయితే మరోవైపు కొన్ని కేసుల్లో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మహారష్ట్రలో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పోలీసులకు న్యాయమూర్తి.. గడ్డి కోయాలంటూ విచిత్రమైన శిక్ష విధించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర (Maharashtra) పర్భానీ జిల్లా మనావత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌కు సంబంధించిన ఇద్దరు పోలీసులు ఇటీవల రాత్రి పెట్రోలింగ్ విధుల్లో (Patrol duties) ఉన్నారు. అయితే ఆ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మనవాత్ ప్రాంతంలోని వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీంతో కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను ఉదయం 11గంటలకు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టులో న్యాయమూర్తి సిద్ధంగా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఆలస్యంగా 11.30కి కోర్టుకు చేరుకున్నారు.

Technology: ఇదేం టెక్నాలజీ బాబోయ్.. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు మటాష్..!

అప్పటికే ఈ కేసు నిమిత్తం వేచి చూసిన న్యాయమూర్తి.. పోలీసులు ఆలస్యంగా రావడంపై (judge was angry on police) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా రాహిత్యం కింద కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌కు గడ్డి కోసే పనిని అప్పగిస్తూ శిక్ష విధించారు. దీంతో సదరు పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ శిక్షపై ఉన్నతాధికారులకు నివేదించుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు.. మిగతా కానిస్టేబుళ్ల వాంగ్మూలను కూడా నమోదు చేశారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Bride: 2 రోజుల్లో పెళ్లనగా ఈ వధువుకు ఇలా జరిగిందేంటి..? ఫోన్ చేసి పిలిచాడని కాబోయే భర్త ఇంటికి వెళ్తే..!

Updated Date - 2023-11-22T16:54:49+05:30 IST