Share News

Woman Constable: ఈ మహిళా కానిస్టేబుల్‌కు ఏమైంది..? కొద్ది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ..!

ABN , First Publish Date - 2023-11-21T18:36:21+05:30 IST

ఆ దంపతులిద్దరూ పోలీస్ కానిస్టేబుళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఈ క్రమంలో భార్య కొద్ది రోజుల క్రితం పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరువైపు కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే...

Woman Constable: ఈ మహిళా కానిస్టేబుల్‌కు ఏమైంది..? కొద్ది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ..!
ప్రతీకాత్మక చిత్రం

ఆ దంపతులిద్దరూ పోలీస్ కానిస్టేబుళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఈ క్రమంలో భార్య కొద్ది రోజుల క్రితం పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరువైపు కుటుంబాల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అయితే ఇంతలో ఏమైందో ఏమోగానీ ఈ మహిళా కానిస్టేబుల్ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధి బులంద్‌షహార్‌లోని సియానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ కుల్దీప్ కుమార్ అనే వ్యక్తికి.. కానిస్టేబుల్‌గా (woman constable) పని చేస్తున్న చంచల్ (25) అనే యువతితో 2022లో వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరూ పిలిభిత్‌లో పని చేస్తున్నారు. ఇటీవలే చంచల్ (woman gives birth to baby) మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె ప్రసూతి సెలవులో ఉంది. అయితే దంపతుల మధ్య ఇన్నాళ్లూ ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి వీరి ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది.

Viral News: పళ్లతోనే గిన్నీస్ బుక్ రికార్డును సాధించిన మహిళ.. ఆమెకు ఎన్ని దంతాలు ఉన్నాయో తెలిస్తే..!

అత్తమామల ఇంట్లో ఉన్న చంచల్.. సోమవారం ఎవరూ ఊహించని విధంగా ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకుంది. ఈ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త, అత్తమామల చిత్రహింసల కారణంగానే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Wife: కూల్‌డ్రింక్‌లో విషం పెట్టి భర్తను చంపేందుకు ఓ భార్య స్కెచ్.. అసలు నిజం తెలిసిన ఆ భర్త ఏం చేశాడంటే..!

Updated Date - 2023-11-21T19:01:09+05:30 IST