Share News

Viral Video: ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు రియల్.. ఈ బైకర్ చేసిన విన్యాసం చూస్తే.. మతి పోవాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-19T16:31:18+05:30 IST

సినిమాల్లో చూసే సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఇది రియాలా.. లేక గ్రాఫిక్సా.. అని అనిపిస్తుంటుంది. ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే..

Viral Video: ఇది సినిమా గ్రాఫిక్స్ కాదు రియల్.. ఈ బైకర్ చేసిన విన్యాసం చూస్తే.. మతి పోవాల్సిందే..

సినిమాల్లో చూసే సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఇది రియాలా.. లేక గ్రాఫిక్సా.. అని అనిపిస్తుంటుంది. ఇంకొందరు చేసే విన్యాసాలు చూస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకుపై చేసిన విన్యాసం చూసి.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై భయంకర విన్యాసం (Bike stunts) చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రత్యేకంగా తయారు చేసిన రోడ్డుపై అతను ఈ విన్యాసం చేసేందుకు సిద్ధమవుతాడు. సాధారణంగా బైకర్లు ఎగుడు, దిగుడు రోడ్లపైన, కొండ ప్రాంతాల్లో విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అయితే ఇతను మాతం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేశాడు. బైకుపై వేగంగా వచ్చిన అతను ఏటవాలుగా ఏర్పాటు చేసిన రోడ్డు పైనుంచి గాల్లోకి లేచి.. పక్కనే ఉన్న పెద్ద ఇంటి పైకి దూసుకెళ్లాడు.

Viral Video: వంట చేసేందుకు సిద్ధమైన వ్యక్తికి.. ఊహించని షాక్ ఇచ్చిన కోడి.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ఇంటి పైనుంచి వెళ్లిన అతను అటు నుంచి అటే పక్కన ఉన్న మరో ఏటవాలు రోడ్డుపైకి ల్యాండ్ అవుతాడు. అంత పెద్ద ఇంటిపై ఏమాత్రం టచ్ కాకుండా వెళ్లడం చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగానికి భిన్నంగా అతను చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిజంగా అద్భుతంగా ఉంది’’.. అని కొందరు, ‘‘ఇతను రియల్ హీరో’’.. అని మరికొందరు, ‘‘అనుభవం లేనిది.. ఇలాంటివి ప్రయత్నించవద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తుంటారు.

Viral Video: నీళ్లలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాడునుకుంటే ఇతనేంటీ.. చివరికి అందరికీ ఇలా షాక్ ఇచ్చాడు..

Updated Date - 2023-11-19T16:31:20+05:30 IST