Share News

Viral Video: నీళ్లలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాడునుకుంటే ఇతనేంటీ.. చివరికి అందరికీ ఇలా షాక్ ఇచ్చాడు..

ABN , First Publish Date - 2023-11-19T15:51:07+05:30 IST

చూడగానే భయపడే జంతువులు, పాములతో కొందరు ఆటలు ఆడుకోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు పులులు, సింహాలతో పెంపుడు జంతువుల తరహాలో సరదాగా గడుపుతుంటారు. మరికొందరు పాములతోనూ ప్రమాదకర ఆటలు ఆడుకుంటుంటారు. ఈ తరహా...

Viral Video: నీళ్లలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాడునుకుంటే ఇతనేంటీ.. చివరికి అందరికీ ఇలా షాక్ ఇచ్చాడు..

చూడగానే భయపడే జంతువులు, పాములతో కొందరు ఆటలు ఆడుకోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు పులులు, సింహాలతో పెంపుడు జంతువుల తరహాలో సరదాగా గడుపుతుంటారు. మరికొందరు పాములతోనూ ప్రమాదకర ఆటలు ఆడుకుంటుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇలాంటి పనే చేసి, అందరికీ షాక్ ఇచ్చాడు. నీళ్లలో పెద్ద పెద్ద చేపలు పడుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ చివరకు అతడు చేసిన పని చూసి అంతా అవాక్కయ్కారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పంట పొలాల్లోని నీటి కుంట వద్దకు వెళ్తాడు. అయితే అక్కడి నీటిలో ఏదో ఉనట్లు అతడు గుర్తిస్తాడు. దీంతో మెల్లగా దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. చేతిని మెల్లగా నీటిలో ఉంచి సడన్‌గా (man caught python) పెద్ద కొండచిలువను పట్టుకుంటాడు. అతడు తాకగానే కొండచిలువ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అతడి నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయినా అతను దాన్ని వదలకుండా తల వద్ద గట్టిగా పట్టుకుని చివరకు నీటి నుంచి పక్కకు తీసుకెళ్తాడు.

Viral Video: వంట చేసేందుకు సిద్ధమైన వ్యక్తికి.. ఊహించని షాక్ ఇచ్చిన కోడి.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

తలను పట్టుకోగానే కొండచిలువ అతడి చేతిని గట్టిగా చుట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయినా అతను దాన్నుంచి తప్పించుకుంటూనే తలను గట్టిగా పట్టుకుని ఉంటాడు. ఈ క్రమంలో చివరకు దాని తలపై ముద్దు కూడా పెట్టేస్తాడు. తర్వాత దాన్ని అడవిలో వదిలేస్తాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! కొండచిలువను భలె పట్టుకున్నాడే’’.. అని కొందరు, ‘‘కొండచిలువకు ముద్దు పెట్టడం క్రేజీగా ఉంది’’.. అని మరికొందరు, ‘‘దాన్ని అలా ఎందుకు ఇబ్బంది పెడతారు.. ప్రశాంతంగా ఉండనివ్వండి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-11-19T15:51:09+05:30 IST