Share News

Viral Video: బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్.. చివరకు వారు చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

ABN , First Publish Date - 2023-11-17T15:47:26+05:30 IST

బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు తల ప్రాణం కాస్తా తోకకు వస్తుంటుంది. సీటు కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా గొడవలు పడే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. చివరికి సీటు కోసం మహిళలు కూడా...

Viral Video: బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్.. చివరకు వారు చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

బస్సు, రైలు ప్రయాణాల్లో కొన్నిసార్లు తల ప్రాణం కాస్తా తోకకు వస్తుంటుంది. సీటు కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏకంగా గొడవలు పడే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. చివరికి సీటు కోసం మహిళలు కూడా జుట్టు పట్టకుని కొట్టుకున్న సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ దంపతులకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్ వేశాడు. చివరికి వారిద్దరూ కలిసి చేసిన పని చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. బస్టాండ్‌లో ప్రయాణికులంతా బస్సు కోసం వేచి చూస్తుంటారు. ఇంతలో ఓ బస్సు అక్కడికి వస్తుంది. చాలా మంది ప్రయాణికులు ఆ బస్సు ఎక్కేందుకు ఎగబడతారు. దీంతో కొందరికి సీటు దొరకడం కష్టమవుతుంది. అప్పటికే బస్సు లోపలికి వెళ్లిన ఓ వ్యక్తి.. తన భార్యకూ సీటు కావాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆమె బస్సులోకి ఎక్కడం సాధ్యం కాకపోవడంతో ఎలాగైనా సీటు సంపాదించాలని వెరైటీ ప్లాన్ వేస్తాడు. తన భార్యను బస్సు వెనక్కు రమ్మని, కిటికీ నుంచి పైకి ఎక్కమని సైగ చేస్తాడు. దీంతో ఆమె కూడా ధైర్యం చేసి, చెప్పులు తీసి తన భర్తకు ఇస్తుంది.

Viral Video: వేడి వేడి సమోసాను ఎంతో ఇష్టంగా తింటున్న బాలిక.. మధ్యలో అనుమానం వచ్చి లోపల చూడగా.. షాకింగ్ సీన్..

తర్వాత భర్త చేయి పట్టుకుని కిటికీ గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఎంతో చాకచక్యంగా ఆమె కిటికీలోంచి (woman entered the bus through the window) లోపలికి వెళ్లడం చూసి చుట్టు పక్కల ఉన్న ప్రయాణికులు అవాక్కవుతారు. ఆమె చేసిన విన్యాసం చూసి అక్కడే మరో ప్రయాణికురాలు నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోతుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈమె టాలెంట్ మామూలుగా లేదుగా’’... అంటూ కొందరు, ‘‘సీటు కోసం ఎంత సాహసం చేసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime News: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన బాలిక.. బాత్రూంకి వెళ్లి ఎంతకీ రాకపోవడంతో.. అనుమానం వచ్చి కంగారుగా వెళ్లి చూడగా..

Updated Date - 2023-11-17T15:47:27+05:30 IST