Share News

Viral Video: రైల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డతో కనిపించిన మహిళ.. విషయం ఏంటా అని ఆరా తీయగా.. షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-11-16T18:10:09+05:30 IST

మహిళలకు నిత్యం ఎక్కడ చూసినా ఏదో ఒక రూపంలో సమస్య ఎదురవుతుంటుంది. ఇక వృద్ధులు, గర్భిణులైతే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్రధానంగా గర్భిణులు ప్రయాణ సమయాల్లో ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి పురిటినొప్పులు రావడం, సమయానికి ఎవరూ లేకపోవడం...

Viral Video: రైల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డతో కనిపించిన మహిళ.. విషయం ఏంటా అని ఆరా తీయగా.. షాకింగ్ ట్విస్ట్..

మహిళలకు నిత్యం ఎక్కడ చూసినా ఏదో ఒక రూపంలో సమస్య ఎదురవుతుంటుంది. ఇక వృద్ధులు, గర్భిణులైతే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్రధానంగా గర్భిణులు ప్రయాణ సమయాల్లో ఊహించని సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి పురిటినొప్పులు రావడం, సమయానికి ఎవరూ లేకపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కొందరు చావు అంచుల వరకూ వెళ్తుండగా.. మరికొందరు క్షేమంగా ప్రసవిస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ రైల్లో అప్పుడు పుట్టిన శిశువును ఎత్తుకుంది. ఆరాతీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ గర్భిణి (pregnant woman) ముంబై లోకల్ (mumbai local train) రైల్లో ప్రయాణిస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. రైలు కదిలిన కొద్దిసేపటికి ఆమెకు సడన్‌గా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న వారు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఓ వృద్ధురాలు అక్కడికి వచ్చింది. భయపడొద్దు.. అని ఆమెకు ధైర్యం చెప్పి దగ్గరుండి ప్రసవం చేసింది. చివరకు గర్భిణి క్షేమంగా ప్రసవించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Google-Police: దగ్గర్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా..? అని గూగుల్‌లో వెతికితే షాకింగ్ రిజల్ట్..!

శిశువును ఆనందంతో పైకి ఎత్తుకున్న తల్లిని చూసి అంతా మొదట షాక్ అయ్కారు. చివరకు విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చుట్టుప్పక వారంతా శిశువును ఎత్తుకుని ముద్దాడారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వృద్ధురాలు.. సమయానికి దేవతలా వచ్చింది’’... అంటూ కొందరు, ‘‘హమ్మయ్య.. ఎవరికీ ఏమీ కాలేదు.. థ్యాంక్స్ గాడ్’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‍‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వారెవ్వా.. ఏం తెలివి బాసూ.. కారు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ వ్యక్తి టెక్నిక్‌ను చూడాల్సిందే..!

Updated Date - 2023-11-16T18:10:11+05:30 IST