Share News

Viral News: పెంపుడు కుక్క ప్రసవించిందని ఊరంతా భోజనాలు పెట్టించిన యజమాని.. మేళతాళాలు.. బ్యాండ్ బాజాలతో డాన్సులు..!

ABN , First Publish Date - 2023-11-14T17:58:27+05:30 IST

కుక్కలను పెంచుకోవడం అనేది ప్రస్తుతం స్టేటస్ సింబల్ అయిపోయింది. ధనవంతుల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరు వాటిని పెంచే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. సొంత పిల్లల తరహాలో..

Viral News: పెంపుడు కుక్క ప్రసవించిందని ఊరంతా భోజనాలు పెట్టించిన యజమాని.. మేళతాళాలు.. బ్యాండ్ బాజాలతో డాన్సులు..!

కుక్కలను పెంచుకోవడం అనేది ప్రస్తుతం స్టేటస్ సింబల్ అయిపోయింది. ధనవంతుల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయికి తగ్గట్టు వివిధ రకాల జాతులకు చెందిన కుక్కలను పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరు వాటిని పెంచే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. సొంత పిల్లల తరహాలో కుక్కల పట్ల కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మరికొందరైతే వాటికి పుట్టిన రోజులు కూడా ఘనంగా నిర్వహించడం కూడా చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‍‌చల్ చేస్తోంది. పెంపుడు కుక్క ప్రసవించిందని ఓ మహిళ మేళతాళాలు, బ్యాండ్ బాజాలతో బారసాల చేసింది. అలాగే ఊరందరినీ పిలిచి విందు భోజనాలు కూడా పెట్టింటించింది. ఈ మహిళకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) భిల్వా పట్టణ పరిధి మేరాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజ్ కలి అనే మహిళ.. తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నివస్తోంది. ఈమె కొన్ని నెలలుగా ఓ కుక్కను పెంచుతోంది. ఇదిలావుండగా, ఇటీవల అతడి కుక్క 9 పిల్లలకు (dog gave birth nine puppies) జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన సమయంలో జరిపే బారసాల కార్యక్రమాన్ని.. తన కుక్క పిల్లలకూ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కార్యక్రమం జరిపించామంటే.. జరిపించాం.. అన్నట్లు కాకుండా వివిధ రకాల శాఖాహార వంటకాలను సిద్ధం చేయించింది. అలాగే ఊరు మొత్తం ఆహ్వానం అందించింది.

Geyser: గీజర్‌ను వాడుతున్నారా..? ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. అది బాంబులా పేలడం ఖాయం..!

64.jpg

కుక్క పిల్లలకు బారసాల అనగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలా చేస్తారో చూద్దాం అనే ఆసక్తితో మొత్తం 400 మంది హాజరయ్యారు. అతిథులకు అన్ని రకాలా మర్యాదలు చేయడంతో పాటూ వినోదం అందించేందుకూ ఏర్పాటు చేశారు. ఆర్కెస్ట్రాతో (Orchestra) పాటూ డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె సమారు రూ.1లక్ష ఖర్చు చేసినట్లు తెలిసింది. దీనిపై రాజ్ కలిని ప్రశ్నించగా.. తన మొదటి భర్త చనిపోయాడని తెలిపింది. దీంతో రెండో వివాహం చేసుకోగా అతను కూడా చనిపోయాడని చెప్పింది. దీంతో తాను మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని తెలిపింది. ఆ సమయంలో కుక్కను పెంచుకున్నానని, అప్పటి నుంచి తాను మానసిక ఇబ్బందుల (Mental problems) నుంచి బయటపడినట్లు చెప్పింది.

Viral Video: చావు తెలివితేటలంటే ఇవే.. రెస్టారెంట్‌లో బిల్లును ఎగ్గొట్టేందుకు ఓ యువతి వెరైటీ ప్లాన్.. సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో..!

కుక్క తన ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత.. తాను క్రమక్రమంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందానని పేర్కొంది. అందుకే తన కుక్క అంటే తనకు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. కాగా, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అంతా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడుతున్నారు. రాజ్‌కలి ప్రస్తుతం వ్యవసాయం చేస్తోంది. ఈమెకు కుక్క మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో ఆవులు, గేదెలు కూడా ఉన్నాయి. కాగా, కుక్క పిల్లల బారసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఇంట్లోని పాత వస్తువులతో మహిళ వినూత్న ప్రయోగం.. ఈమె డ్రమ్స్ వాయించే స్టైల్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - 2023-11-14T17:58:29+05:30 IST