Share News

Viral Video: ఇంట్లోని పాత వస్తువులతో మహిళ వినూత్న ప్రయోగం.. ఈమె డ్రమ్స్ వాయించే స్టైల్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-12T18:59:19+05:30 IST

సరైన వేదిక లేక కొందరు, అన్ని సౌకర్యాలు ఉన్నా బద్ధకిస్తూ మరికొందరు తమలోని ప్రతిభను పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం అందుబాటులో ఉన్న వస్తువులతోనే చివరకు అద్భుతాలు సృష్టిస్తుంటారు. పాత వస్తువులతో వినూత్న వాహనాలను తయారు చేసే వారిని చూశాం, అలాగే...

Viral Video: ఇంట్లోని పాత వస్తువులతో మహిళ వినూత్న ప్రయోగం.. ఈమె డ్రమ్స్ వాయించే స్టైల్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

సరైన వేదిక లేక కొందరు, అన్ని సౌకర్యాలు ఉన్నా బద్ధకిస్తూ మరికొందరు తమలోని ప్రతిభను పక్కన పెట్టేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం అందుబాటులో ఉన్న వస్తువులతోనే చివరకు అద్భుతాలు సృష్టిస్తుంటారు. పాత వస్తువులతో వినూత్న వాహనాలను తయారు చేసే వారిని చూశాం, అలాగే పాత డ్రమ్ములు, ఫ్యాన్లు తదితర వస్తువులతో కరెంట్ ఉత్పత్తి చేసే వారిని కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంట్లోని పాత వస్తువులతో అద్భుతంగా డ్రమ్స్ వాయిస్తున్న మహిళను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళకు డ్రమ్స్ వాయించడం అంటే ఎంతో ఇష్టం. అయితే అందుకు సంబంధించిన కొత్త పరికరాలను కొనే స్థోమత ఆమెకు లేదు. అయినా ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లోని పాత స్టీల్ వస్తువులను చూడగానే ఆమెకు ఠక్కున ఓ ఐడియా వచ్చింది. వెంటనే వాటిని సేకరించి డ్రమ్స్ తరహాలో తయారు చేసింది. అన్నీ సిద్ధం చేసుకున్నాక.. (woman plays drums with old things) ఓ మ్యూజిక్ ప్లే చేసి, దానికి అనుగుణంగా డ్రమ్స్ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Viral Video: కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం.. చివరకు కత్తితో కోసి చూడగా.. షాకింగ్ సీన్..

ఎక్కడా తడబడకుండా, ఎంతో వేగంగా డ్రమ్స్ వాయించింది. ఆమెలో దాగి ఉన్న ట్యాలెంట్.. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వావ్! ఈమె టాలెంట్ అద్భుతం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని అంతా ప్రోత్సహించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘మీకు మంచి భవిష్యత్ ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కూతురి పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించిన తండ్రి.. కానీ కేక్‌ తెచ్చాడనుకుంటే.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..

Updated Date - 2023-11-12T18:59:27+05:30 IST