Share News

Viral Video: కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం.. చివరకు కత్తితో కోసి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2023-11-12T15:56:46+05:30 IST

కొండచిలువలు సినిమాల్లో చూపించినట్లుగా కొన్నిసార్లు పెద్ద పెద్ద జంతువులతో పాటూ మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. దీంతో వాటిని చూడగానే ఎలాంటి జంతువైనా తోకముడిచి పారిపోతుంటాయి. ఇక మనుషులైతే వాటికి ఆమడదూరంలోనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని...

Viral Video: కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం.. చివరకు కత్తితో కోసి చూడగా.. షాకింగ్ సీన్..

కొండచిలువలు సినిమాల్లో చూపించినట్లుగా కొన్నిసార్లు పెద్ద పెద్ద జంతువులతో పాటూ మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. దీంతో వాటిని చూడగానే ఎలాంటి జంతువైనా తోకముడిచి పారిపోతుంటాయి. ఇక మనుషులైతే వాటికి ఆమడదూరంలోనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని ప్రమాదకర జంతువులు సైతం వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం వచ్చింది. దీంతో చివరకు దాని కడుపు చీల్చి చూడగా.. లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని (Florida) ఎవర్‌గ్లేడ్స్‌లోని నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో బర్మీస్ కొండచిలువలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తాజాగా, పార్క్‌లో చనిపోయి ఉన్న 18 అడుగుల కొండచిలువను (18-foot python) చూసి స్థానికులు షాక్ అయ్యారు. దాని కడుపులో ఏదో పెద్ద అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోపల ఉన్న జంతువేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొండచిలువ కడుపును కోశారు.

Viral Video: యజమాని అడిగిన గణిత ప్రశ్నలకు.. ఈ కుక్క ఎలా సమాధానం చెబుతోందో చూడండి..

చివరకు కొండచిలువ కడుపు కోసి చూడగా లోపలు 5 అడుగులు మొసలి (crocodile found in the python stomach) ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. మొసలిని మింగిన కొండచిలువ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు గుర్తించారు. ఫ్లోరిడా పరిధిలో ఈ బర్మీస్ కొండచిలువలు సుమారు లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ కొండచిలువ చాలా డేంజర్‌లా ఉందే’’.. అని కొందరు, ‘‘ఇలాంటి కొండచిలువను ఎప్పుడూ చూడలేదు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆన్‌లైన్ క్లాసులో టీచర్‌ను అడగకూడని ప్రశ్న అడిగిన విద్యార్థి.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

Updated Date - 2023-11-12T15:56:47+05:30 IST