Share News

Viral Video: ఆన్‌లైన్ క్లాసులో టీచర్‌ను అడగకూడని ప్రశ్న అడిగిన విద్యార్థి.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-11-11T18:15:06+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో హార్ఢ్ వర్క్ కాకుండా ఎక్కువ మంది స్మార్ట్ వర్క్‌తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. చివరకు..

Viral Video: ఆన్‌లైన్ క్లాసులో టీచర్‌ను అడగకూడని ప్రశ్న అడిగిన విద్యార్థి.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో హార్ఢ్ వర్క్ కాకుండా ఎక్కువ మంది స్మార్ట్ వర్క్‌తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ద్వారా ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. చివరకు చిన్న పిల్లలకు పాఠాలు కూడా ఆన్‌లైన్‌లోనే చెప్పే వెసులుబాటు వచ్చేసింది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనేక సమస్యలు తలెత్తుంటాయి. తాజాగా, ఓ యువతికి ఆన్‌లైన్ క్లాసులో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ విద్యార్థి ఆమెను అడగకూడని ప్రశ్న అడిగాడు. దీంతో చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రక్షిత అనే బయాలజీ టీచర్ (Biology teacher) విద్యార్థులకు.. నాలుగేళ్లుగా ఆన్‌లైన్ క్లాసులు (Online classes) నిర్వహిస్తూ ఉంది. అయితే ఇటీవల ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉదయం క్లాసులు ప్రారంభించిన కాసేపటి తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తూ ఉంది. ఈ క్రమంలో 18 ఏళ్ల ఓ విద్యార్థి వింత ప్రశ్న అడిగాడు. ‘‘మేడమ్, బిడ్డ ఎలా పుడుతుందో.. ప్రాక్టికల్‌గా చూపించండి’’.. అని అడగ్గానే.. యువతి ఒక్కసారిగా షాక్ అయింది. విద్యార్థి నిర్వాకంతో ఆమె చాలా సేపు బాధపడింది. చివరకు తేరుకుని, అతడికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.

Viral Video: చిన్నప్పటి కాకి కథ.. నిజమా కాదా అని పరీక్షించగా.. ఈ కాకి ఏం చేసిందో మీరే చూడండి..

విద్యార్థితో ఆమె ఇలా చెప్పింది. ‘‘చూడా బాబూ!.. నాకు వివాహం కాలేదు.. నువ్వు అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం తెలీదు. మీ అమ్మ నీకు జన్మ ఇచ్చింది కాబట్టి.. వెళ్లి ఆమెను అడుగు తెలుస్తుంది’’.. అని సమాధానం ఇచ్చింది. యువతి మాట్లాడుతూ, ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు తమ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని తెలుసుకోవాలని గుర్తు చేసింది. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు క్లాసులు ఆపేద్దామని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్‌కు మద్దతు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘మహిళా ఉపాధ్యాయులకు అంతా అండగా నిలవాలి’’ అంటూ కొందరు, ‘‘చాలా బాగా సమాధానం ఇచ్చారు మేడం’’.. అంటూ మరికొందరు, ‘‘టీచర్లకు గౌరవం ఇవ్వాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెంపుడు కుక్కతో పాటు పార్కులో నడుస్తున్న 8 ఏళ్ల పాప.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన మరో శునకం.. చివరకు..!

Updated Date - 2023-11-11T18:15:09+05:30 IST