Share News

Viral Video: పెంపుడు కుక్కతో పాటు పార్కులో నడుస్తున్న 8 ఏళ్ల పాప.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన మరో శునకం.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-10T19:22:25+05:30 IST

కొన్ని జంతువులు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తుంటాయి. మరికొన్ని జంతువుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొన్ని మనుషులను అనుకరిస్తూ ...

Viral Video: పెంపుడు కుక్కతో పాటు పార్కులో నడుస్తున్న 8 ఏళ్ల పాప.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన మరో శునకం.. చివరకు..!

కొన్ని జంతువులు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తుంటాయి. మరికొన్ని జంతువుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల చేష్టలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కొన్ని మనుషులను అనుకరిస్తూ వివిధ రకాల పనులు చేయడం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఇలాంటి జంతువుల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ 8 ఏళ్ల పాప తన పెంపుడు కుక్కతో పాటూ పార్కులో నడుస్తూ ఉండగా.. సడన్‌గా మరో కుక్క పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ 8 ఏళ్ల పాప తన పెంపుడు కుక్కను పట్టుకుని (girl took the dog for walk) వాకింగ్ కోసం పార్క్‌కు తీసుకెళ్తుంది. కుక్కను తాడుతో పట్టుకుని సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఈ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. కాస్త దూరం వెళ్లగానే వెనుక నుంచి మరో కుక్క వేగంగా వారిని ఫాలో చేస్తుంది. సమీపానికి వెళ్లగానే పాపను బెదిరించినట్లుగా చుట్టుముడుతుంది.

Viral News: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా..? రోజుకు 50 వరకు సిగరెట్లు తాగే ఈ పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే..!

పరుగెత్తుకుంటూ వచ్చిన కుక్క.. ‘‘నా స్నేహితుడిని తాడుతో కట్టేసి ఎక్కడికి తీసుకెళ్తున్నావ్.. వదిలెయ్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఆమె చేతిలోని తాడును లాక్కుంటుంది. తర్వాత తన స్నేహితుడిని తీసుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. రెండు కుక్కలూ తప్పించుకుని అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుక్క భలె విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘స్నేహితులంటే ఇలాగే ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘కుక్కలు విశ్వాసానికి మారు పేరు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!

Updated Date - 2023-11-10T19:22:28+05:30 IST