Share News

Viral: మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంటి సామీ.. చోరీ చేసిన డబ్బుతోనే ప్రేమ పెళ్లి చేసుకుని.. నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి మరీ..!

ABN , First Publish Date - 2023-11-09T16:55:02+05:30 IST

కొన్ని ప్రేమ వివాహాలు సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరే పెద్దలను ఒప్పించి కొందరు, పెద్దలకు వ్యతిరేకంగా ఇంటి నుంచి పారిపోయి మరికొందరు ప్రేమ వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా...

Viral: మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంటి సామీ.. చోరీ చేసిన డబ్బుతోనే ప్రేమ పెళ్లి చేసుకుని.. నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి మరీ..!
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని ప్రేమ వివాహాలు సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. అచ్చం సినిమాల్లో మాదిరే పెద్దలను ఒప్పించి కొందరు, పెద్దలకు వ్యతిరేకంగా ఇంటి నుంచి పారిపోయి మరికొందరు ప్రేమ వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా, హర్యానాలో జరిగిన ప్రేమ వివాహ ఘటనలో సినిమా సీన్లకు మించిన ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి చోరీ చేసిన డబ్బులతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత భార్యను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. పోలీసులు విచారించగా చివరకు అదిరిపోయే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

హర్యానాలోని (Haryana) భివానీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా జల్సాలకు అలవాటు పడి చోరీలు చేయడం మొదలెట్టాడు. ఇప్పటికే ఇతడిపై దాడి, బెదిరింపులు, చైన్ స్నాచింగ్ తదితర కేసులు నమోదై ఉన్నాయి. ఇదిలావుండగా, ఇటీవల ఇతడికి స్థానిక బసాయి గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా (thief love with young woman) మారింది. ఎలాగైనా ఆమెనే వివాహం (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెకూ ఇతడంటే ఇష్టం ఉండడంతో పెళ్లికి ఓకే చెప్పేసింది. ఈ క్రమంలో అయితే పెళ్లి చేసుకోవడానికి తగినంత డబ్బులు తన వద్ద లేదు. దీంతో చివరకు (Planning for theft) ఓ పెద్ద చోరీ చేయాలని ప్లాన్ చేశాడు.

Shocking: 14 ఏళ్ల బాలికతో పాటు స్టేషన్‌కు వచ్చిందో మహిళ.. మా పక్కింటి అమ్మాయేనంటూ ఆమె చెప్పింది విని అందరికీ షాక్.. చివరకు..!

haryana-crime-news.jpg

చివరకు ఆనంద్.. తన సహచరులైన బర్వా గ్రామానికి చెందిన రాహుల్, కుల్దీప్, హిసార్ జిల్లా రావత్ ఖేడా గ్రామానికి చెందిన పవన్ అలియాస్ ఖబ్రీతో కలిసి చోరీకి ప్లాన్ చేశారు. అక్టోబర్ 21న రాత్రి భివానీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ నడుపుతున్న కుల్దీప్ అనే వ్యక్తిపై దాడి చేశఆరు. మారణాయుధాలతో దాడి చేసి బెదిరించి, అతడి వద్ద నుంచి రూ.1.60లక్షలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆనంద్ తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఏమీ ఎరుగనట్లుగా తన ప్రేయసితో కలిసి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. తామిద్దరం ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నామని, రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆనంద్‌తో సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఆకట్టుకుంటున్న కుక్కర్ వాలా కాఫీ.. మరిగించకుండానే వేడి వేడి కాఫీని ఎలా చేశాడో చూడండి..

Updated Date - 2023-11-09T17:40:39+05:30 IST