Share News

Shocking Video: గ్యాస్ సిలిండర్‌ను కట్ చేసి చూస్తే.. కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు..!

ABN , First Publish Date - 2023-11-08T16:09:33+05:30 IST

డబ్బు ఆదా చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు పోస్టాఫీసులు, బ్యాంకులు తదితరాల్లో దాచుకుంటే.. మరికొందరు వడ్డీలకు ఇస్తూ పొదుపు చేస్తుంటారు. ఇక పాతతరం వారైతే ఇళ్లల్లోని అల్మారాలు, డబ్బాల్లో దాచుకుంటుంటారు. అలాగే...

Shocking Video: గ్యాస్ సిలిండర్‌ను కట్ చేసి చూస్తే.. కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు..!

డబ్బు ఆదా చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు పోస్టాఫీసులు, బ్యాంకులు తదితరాల్లో దాచుకుంటే.. మరికొందరు వడ్డీలకు ఇస్తూ పొదుపు చేస్తుంటారు. ఇక పాతతరం వారైతే ఇళ్లల్లోని అల్మారాలు, డబ్బాల్లో దాచుకుంటుంటారు. అలాగే చిన్న పిల్లలు నాణేలను కిడ్డీ బ్యాంకుల్లో దాచుకోవడం కూడా చూస్తుంటాం. అయితే ఇంకొందరు మాత్రం చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో డబ్బులను దాచుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి డబ్బులను ఏకంగా గ్యాస్ సిలిండర్‌లో దాచాడు. చివరకు కట్ చేసి చూడగా కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి డబ్బులను పొదుపు (Saving money) చేయడంలో వినూత్న పద్ధతిని అవలంభించాడు. గ్యాస్ సిలిండర్‌ను ఎవరైనా వంట చేసుకునేందుకు వినియోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ వ్యక్తి మాత్రం అందుకు విరుద్ధంగా దాన్ని డబ్బులు దాచుకునేందుకు వినియోగించాడు. రోజూ అందులో (Hiding coins in gas cylinder) రూ.10లు నాణేలు వేస్తూ వచ్చాడు. ఇలా కొన్ని నెలల అనంతరం సిలిండర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో చివరకు దాన్ని గ్యాస్ కట్టర్‌తో తెరిచేందుకు ప్రయత్నించాడు.

Shocking Video: చేతులు లేకున్నా ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అవ్వాలా..? లేక తప్పు చేస్తున్నాడని తెలిసి బాధపడాలా..?

సిలిండర్‌ను కత్తిరించి చూడగా.. అందులో రూ.10నాణేలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. లోపల ఉన్న నాణేలను అన్నింటినీ నట్టింట్లో కిందపోశాడు. దాదాపు ఇల్లు మొత్తం నాణేలతో నిండిపోవడం చూసి అంతా ఖంగుతిన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంతకీ నాణేలను లోపలికి ఎలా వేశాడబ్బా’’.. అని కొందరు, ‘‘ఇలాక్కూడా డబ్బులు దాచుకోవచ్చా’’.. అని మరికొందరు, ‘‘ఎవరికీ అనుమానం రాకుండా.. భలే ఐడియా వేశాడు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking Video: భయమనేదే దీని బ్లడ్‌లో లేదనుకుంటా.. అనకొండను తొక్కుకుంటూ ఈ వింత జంతువు ఎలా వెళ్లిందో చూస్తే..!

Updated Date - 2023-11-08T16:09:34+05:30 IST