Share News

Crime News: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. కొన్నాళ్లకే పెళ్లి విషయమై హోటల్లో కలుసుకున్న జంట.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

ABN , First Publish Date - 2023-11-05T20:34:48+05:30 IST

సమాజంలో మహిళలపై నిత్యం ఏదో రూపంలో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా చాలా మంది మహిళలు మోసగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో ఇంకొందరు...

Crime News: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. కొన్నాళ్లకే పెళ్లి విషయమై హోటల్లో కలుసుకున్న జంట.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..
ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో మహిళలపై నిత్యం ఏదో రూపంలో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా చాలా మంది మహిళలు మోసగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో ఇంకొందరు యువతులను దారుణంగా మోసం చేస్తున్నారు. తాజాగా, ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతికి మ్యాట్రిమోనియల్ సైట్‌లో సింగపూర్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే పెళ్లి విషయం మాట్లాడుకుందామని పిలవడంతో హోటల్‌కి వెళ్లింది. చివరకు ఏం జరిగిందంటే...

నవీ ముంబైలో (Navi Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల మహిళకు.. ఇటీవల మ్యాట్రిమోనియల్ సైట్‌లో (Matrimonial site) సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వివాహ విషయంపై కలిసి మాట్లాడుకుందామని చెప్పడంతో చివరకు అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. చివరకు ఇద్దరూ ముంబైలోని ఓ హాటల్లో కలుసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెను వివిధ ప్రాంతాల్లోని (Indecent behavior on young woman) హోటళ్లకు పిలుస్తూ అత్యాచారం చేశాడు.

Viral Video: జిమ్‌కు వెళ్లే కూతురి బలమేంటో తెలుసుకునేందుకు వింత పరీక్ష పెట్టిన తల్లి.. యువతి చేసిన పని చూడండి..

ఇలా రెండేళ్ల పాటు ఆమెను నమ్మిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు (Indecent photos and videos) కూడా తీసి పెట్టుకున్నాడు. ఇటీవల ఆమె పెళ్లి గురించి పదే పదే అడుగుండడంతో ఫోన్లు లిఫ్ట్ చేయడమే మానేశాడు. చివరకు పెళ్లి చేసుకుంటావా, లేదా అని నిలదీయగా.. ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించాడు. ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. మోసపోయానని తెలుసుకున్న ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: అర్ధరాత్రి ఇంట్లోకి సడన్‌గా భర్త రావడంతో.. ప్రియుడిని కూలర్‌లో దాచిన భార్య.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-11-05T20:36:04+05:30 IST