Share News

Viral Video: జిమ్‌కు వెళ్లే కూతురి బలమేంటో తెలుసుకునేందుకు వింత పరీక్ష పెట్టిన తల్లి.. యువతి చేసిన పని చూడండి..

ABN , First Publish Date - 2023-11-05T16:31:23+05:30 IST

ప్రస్తుతం యువతీయువకులు ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. అదేవిధంగా శారీరక దారుఢ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులు కూడా జిమ్‌కు వెళ్తూ మగవారితో పోటాపోటీగా కసరత్తులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి...

Viral Video: జిమ్‌కు వెళ్లే కూతురి బలమేంటో తెలుసుకునేందుకు వింత పరీక్ష పెట్టిన తల్లి.. యువతి చేసిన పని చూడండి..

ప్రస్తుతం యువతీయువకులు ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. అదేవిధంగా శారీరక దారుఢ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులు కూడా జిమ్‌కు వెళ్తూ మగవారితో పోటాపోటీగా కసరత్తులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. జిమ్‌కు వెళ్లే కూతురికి తల్లి వింత పరీక్ష పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. రోజూ జిమ్‌కు వెళ్తున్న కూతురి బలం ఏంటో తెలుసుకోవాలని ఓ తల్లి వింత పరీక్ష పెట్టింది. ఇంట్లో పడుకుని ఉన్న కూతురిని పిలిచి.. గుమ్మం బయట ఉన్న బియ్యం బస్తాను ఇంట్లోకి తెమ్మని చెప్పింది. దీంతో యువతి (young woman) ఆ పని చేసేందుకు అనాసక్తి చూపిస్తుంది. దీంతో తల్లి చివరకు ‘‘జిమ్‌లో 50 కేజీల డంబెల్స్ ఎత్తుతుంటావ్.. ఈ 30కేజీల బియ్యం బస్తా (30 kg rice bag) ఎత్తలేవా.. ఎత్తితీరాల్సిందే’’.. అంటూ బలవంతం చేస్తుంది. ఇందుకు కూతురు... ‘‘జిమ్‌లో కసరత్తులు వేరు.. బియ్యం మూట ఎత్తడం వేరమ్మా.. పైగా నా చేతి గోర్లు పొడుగ్గా ఉన్నాయ్.. మూటను ఎత్తడం ఇబ్బంది’’.. అని చెబుతుంది.

Viral Video: గాడిదతో డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. చివరకు యువకుడు చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..

యువతి ఆసక్తి చూపించకపోయినా.. తల్లి బలవంతం చేసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో బియ్యం మూటను (young woman carrying rice bag into the house) ఎలాగోలా కాస్త పైకి ఎత్తి పట్టుకుని.. అతి కష్టం మీద ఇంట్లోకి తీసుకొస్తుంది. ఇలా తల్లి పెట్టిన పరీక్షలో ఈజీగా నెగ్గేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆంటీ తన కూతురికి మంచి పరీక్షే పెట్టింది’’.. అని కొందరు, ‘‘ప్రతి ఒక్కరూ రోజూ ఇలాంటి పనులు చేయాలి’’.. అంటూ మరికొందరు, ‘‘యువతి బాగానే ట్రై చేసింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి యజమానితో గొడవపడుతున్న మహిళ.. సడన్‌గా ఎటాక్ చేసిన పెంపుడు కుక్క.. చూస్తుండగానే..

Updated Date - 2023-11-05T16:31:25+05:30 IST