Share News

Viral Video: ఎద్దుకు సహనం నశిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. దారినపోతున్న ఎద్దు కొమ్ములు పట్టుకోవడంతో చివరకు..

ABN , First Publish Date - 2023-11-05T17:38:40+05:30 IST

గేదెలు, ఎద్దులు సాధారణంగా ఎవరిపై దాడి చేయవు. వాటిని ఎంత విసిగించినా తిరిగి ఎటాక్ చేయవు. అయితే కొన్ని ఎద్దులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తాయి. కొన్ని ఎద్దులు ఎరుపు రంగు చూస్తే వెంటనే దాడికి దిగడం చూస్తూ ఉంటాం. అలాగే..

Viral Video: ఎద్దుకు సహనం నశిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. దారినపోతున్న ఎద్దు కొమ్ములు పట్టుకోవడంతో చివరకు..

గేదెలు, ఎద్దులు సాధారణంగా ఎవరిపై దాడి చేయవు. వాటిని ఎంత విసిగించినా తిరిగి ఎటాక్ చేయవు. అయితే కొన్ని ఎద్దులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తాయి. కొన్ని ఎద్దులు ఎరుపు రంగు చూస్తే వెంటనే దాడికి దిగడం చూస్తూ ఉంటాం. అలాగే బుల్ ఫైట్ సమయంలోనూ కొన్ని ఎద్దులు అందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని ఎద్దులను కెలకాలని ప్రయత్నించినా కూడా చాలా సీరియస్ అవుతుంటాయి. అలాంటి ఎద్దుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు దారి వెళ్తున్న ఎద్దు కొమ్ములను పట్టుకుని ఆట పట్టించారు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు ఎద్దులు దారి పక్కన వెళ్తుంటాయి. మధ్యలో ఇంటి ఆవరణలో ఉన్న వారు ఎద్దులను ఆట పట్టించాలని చూస్తారు. ముందు వెళ్తున్న ఎద్దు కొమ్ములు పట్టుకుని లాగుతారు. దీంతో ఆ ఎద్దుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. వారిపై దాడి చేయాలని ప్రయత్నిస్తుంది. అయితే మధ్యలో ఓ పెద్ద చెక్క పలక అడ్డుగా ఉండడంతో సాధ్యం కాదు. అయినా ఎద్దు మాత్రం వెనక్కు తగ్గదు. ఎలాగైనా కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో (Bull attack on youth) ముందు కాళ్లు పైకి లేపి మరీ వారి పైకి దూకుతుంది.

Viral Video: ఇంటి యజమానితో గొడవపడుతున్న మహిళ.. సడన్‌గా ఎటాక్ చేసిన పెంపుడు కుక్క.. చూస్తుండగానే..

ఈ క్రమంలో చెక్క పలక కిందపడిపోతుంది. దీంతో లోపలు ఉన్న వారు భయంతో వణికిపోతారు. చెక్క అడ్డు తొలగిపోగానే ఎద్దు ఆవేశంతో లోపలికి వెళ్లి వారిపై విరుచుకుపడుతుంది. పక్కన ఉన్న వారు వారిని కాపాడే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. ఎద్దు దాడిలో లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దారినపోతున్న ఎద్దును అనవసరంగా కెలికారు’’.. అని కొందరు, ‘‘వామ్మో! ఈ ఎద్దును చూస్తుంటే భయమేస్తోంది’’.. అని మరికొందరు, ‘‘మూగ జీవాలే కదా ఏం చేస్తాయిలే అనుకుంటే.. ఇలాగే జరుగుతుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: జిమ్‌కు వెళ్లే కూతురి బలమేంటో తెలుసుకునేందుకు వింత పరీక్ష పెట్టిన తల్లి.. యువతి చేసిన పని చూడండి..

Updated Date - 2023-11-05T17:38:42+05:30 IST