Share News

Viral Video: నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో.. పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-11-05T18:41:42+05:30 IST

మానవత్వం మచ్చుకైనా కనపడని ప్రస్తుత రోజుల్లో.. అప్పుడప్పుడూ చోటు చేసుకునే కొన్ని ఘటనలు చూస్తే ఇంకా మనవత్వం బతికుందని అనిపిస్తుంటుంది. సాటి మనుషుల పట్లే కాకుండా ఇంట్లో పిల్లలపై కూడా కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు..

Viral Video: నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో.. పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడో చూడండి..

మానవత్వం మచ్చుకైనా కనపడని ప్రస్తుత రోజుల్లో.. అప్పుడప్పుడూ చోటు చేసుకునే కొన్ని ఘటనలు చూస్తే ఇంకా మనవత్వం బతికుందని అనిపిస్తుంటుంది. సాటి మనుషుల పట్లే కాకుండా ఇంట్లో పిల్లలపై కూడా కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేయడం చూస్తుంటాం. అయితే కొందరు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేని మనుషుల పట్ల కూడా అమితమైన ప్రేమను చూపిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు చేతిలో డబ్బులు లేకపోవడంతో హోటల్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ (woman) తింటూ తింటూ మధ్యలో అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఇది గమనించిన బాలుడు.. మహిళ తిని వెళ్లిన ప్లేటులోని ఆహారాన్ని తీసుకోబోతాడు. పిల్లాడిని గమనించిన హోటల్ వెయిటర్ (Hotel waiter) .. వేగంగా అక్కడికి (waiter takes the plate from boy his hand) వెళ్లి చేతిలోని ప్లేటును లాక్కుంటాడు. దీంతో బాలుడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇదంతా గమనిస్తున్న పక్కన ఉన్న వారంతా అయ్యో పాపం! అని జాలిపడతారు.

Viral Video: ఎద్దుకు సహనం నశిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.. దారినపోతున్న ఎద్దు కొమ్ములు పట్టుకోవడంతో చివరకు..

అయితే పిల్లాడి ప్లేటును తీసుకెళ్లిన వెయిటర్.. కాసేపటికి వేరే ప్లేటులో మంచి ఆహారాన్ని తీసుకొస్తాడు. టేబుల్‌పై ప్లేటు పెట్టగానే తినడానికి పిల్లాడు సంకోచిస్తాడు. దీంతో వెయిటర్ పిల్లాడిపై చేయి వేసి, హ్యాపీగా తిను అని చెప్పాడు. దీంతో బాలుడు ఎంతో సంతోషించి ప్లేటులోని ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా స్కిప్టెడ్ మాదిరి ఉందే’’.. అని కొందరు, ‘‘వెయిటర్ చాలా గ్రేట్’’.. అని మరికొందరు, ‘‘మనసుకు హత్తుకునే ఘటన’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జిమ్‌కు వెళ్లే కూతురి బలమేంటో తెలుసుకునేందుకు వింత పరీక్ష పెట్టిన తల్లి.. యువతి చేసిన పని చూడండి..

Updated Date - 2023-11-05T18:41:43+05:30 IST