Share News

Viral Video: కుక్క పిల్లలకు మహిళ భోజనం పెట్టడంతో.. చివరకు తల్లి కుక్క ఎలా రియాక్ట్ అయ్యిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-11-05T21:28:57+05:30 IST

సాయం చేసిన వారికి సాయం చేయడం పక్కనపెడితే.. తిరిగి వారికే నమ్మకద్రోహం చేసే మనుషులున్న ప్రస్తుత సమాజంలో జంతువులే ఎంతో నయం అనిపిస్తుంటుంది. కుక్కలకు చిన్న సాయం చేస్తే చాలు.. జీవితాంతం అవి మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి. కొన్నిసార్లు...

Viral Video: కుక్క పిల్లలకు మహిళ భోజనం పెట్టడంతో.. చివరకు తల్లి కుక్క ఎలా రియాక్ట్ అయ్యిందో చూస్తే..

సాయం చేసిన వారికి సాయం చేయడం పక్కనపెడితే.. తిరిగి వారికే నమ్మకద్రోహం చేసే మనుషులున్న ప్రస్తుత సమాజంలో జంతువులే ఎంతో నయం అనిపిస్తుంటుంది. కుక్కలకు చిన్న సాయం చేస్తే చాలు.. జీవితాంతం అవి మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని కుక్కలు మనుషులకు కనువిప్పు కలిగేలా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. కుక్క పిల్లలకు సాయం చేసిన మహిళ పట్ల తల్లి కుక్క స్పందించిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క తన పిల్లలతో కలిసి ఆహార వేటకు వెళ్తుంది. అయితే దానికి ఎక్కడా ఆహారం దొరకదు. దీంతో ఓ ప్రాంతంలో నిరాశంగా పడుకుని ఉంటాయి. కుక్క పిల్లలేమో ఆకలితో అలమటిస్తుంటాయి. అటుగా వెళ్లిన ఓ మహిళ వాటిని గమనిస్తుంది. వెంటనే ఆహారం తీసుకొచ్చి (woman feeding puppies) కుక్క పిల్లలకు పెడుతుంది. అప్పటికే ఆకలితో అలమటిస్తూ ఉన్న కుక్క పిల్లలు ఆహారం కనపడగానే కడుపునిండా తింటాయి.

Crime News: మ్యాట్రిమోనియల్ సైట్‌లో సింగపూర్ వ్యక్తితో పరిచయం.. కొన్నాళ్లకే పెళ్లి విషయమై హోటల్లో కలుసుకున్న జంట.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

తన పిల్లలు ఆకలి తీరడంతో తల్లి కుక్క ఎంతో సంతోషపడుతుంది. వెంటనే తమ ఆకలి తీర్చిన మహిళ వద్దకు వెళ్లి.. ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా ఆమె చేయి పట్టుకుంటుంది. కుక్క స్పందించిన తీరుకు మహిళ కూడా ఎంతో సంతోషపడుతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్క విశ్వాసానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ’’.. అంటూ కొందరు, ‘‘మహిళ చేసిన పని ఎంతో గ్రేట్’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో.. పిల్లాడు తింటున్న ప్లేటును లాక్కెళ్లిన వెయిటర్.. చివరికి ఏం చేశాడో చూడండి..

Updated Date - 2023-11-05T21:30:01+05:30 IST