Share News

Shocking Video: భయమనేదే దీని బ్లడ్‌లో లేదనుకుంటా.. అనకొండను తొక్కుకుంటూ ఈ వింత జంతువు ఎలా వెళ్లిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-07T20:09:18+05:30 IST

కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేయగల సామర్థ్యం దానికి ఉంటుంది. అందుకే కొండచిలువను చూడగానే జంతువులన్నీ భయంతో పారిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు...

Shocking Video: భయమనేదే దీని బ్లడ్‌లో లేదనుకుంటా.. అనకొండను తొక్కుకుంటూ ఈ వింత జంతువు ఎలా వెళ్లిందో చూస్తే..!

కొండచిలువలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేయగల సామర్థ్యం దానికి ఉంటుంది. అందుకే కొండచిలువను చూడగానే జంతువులన్నీ భయంతో పారిపోతుంటాయి. అయితే కొన్నిసార్లు కొండచిలువలు కూడా భయపడే సందర్భాలు ఎదురవుతుంటాయి.

ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం భయం లేకుండా అనకొండను సైతం తొక్కుకుంటూ వెళ్తున్న వింత జంతువును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతంలో ఓ పెద్ద కొండచిలువ (python) ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో కోతి ఆకారంలో ఉండే ఓ వింత జీవి (Sloth) అటుగా వస్తుంది. తన ముందు పెద్ద కొండచిలువ ఉందన్న విషయం కూడా మర్చిపోయి.. తన మానాన తాను పాకుతూ వెళ్తుంటుంది. చివరకు కొండచిలువ సమీపానికి వచ్చినా కూడా దానిలో ఏమాత్రం భయం కనిపించదు. పైగా కొండచిలువ తలపై తన పొడవాటి గోర్లు ఉన్న ముందు కాళ్లను ఉంచి ‘‘హే.. కొండచిలువా తప్పుకో.. నాకు అర్జంట్ పనుంది వెళ్లాలి’’.. అన్నట్లుగా కొండచిలువ పైనుంచి దాటి వెళ్లిపోతుంది.

Viral Video: కుక్క పిల్లలకు మహిళ భోజనం పెట్టడంతో.. చివరకు తల్లి కుక్క ఎలా రియాక్ట్ అయ్యిందో చూస్తే..

ఆ వింత జీవి తాకగానే కొండచిలువ ఒక్కసారిగా భయపడిపోతుంది. కిక్కురుమనకుండా అలాగే ఉండిపోతుంది. పక్కనుంచి వెళ్లిపోతున్నా.. ‘‘వామ్మో! దీంతో పెట్టుకుంటే నేను మటాషే.. సైలెంట్‌గా ఉండడమే బెటర్’’.. అన్నట్లుగా కదలకుండా ఉండిపోతుంది. ఆ వింతజీవి మాత్రం ఠీవీగా పాక్కుంటూ అక్కడి నుంచి తనదారిన తాను వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.

Viral Video: అల్లావుద్దీన్ చాపకు టెక్నాలజీ జోడించిన యువకుడు.. రోడ్డుపై ఎలా దూసుకెళ్తున్నాడో చూడండి..


మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ చదవండి

Updated Date - 2023-11-07T20:23:26+05:30 IST