Share News

Shocking Video: చేతులు లేకున్నా ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అవ్వాలా..? లేక తప్పు చేస్తున్నాడని తెలిసి బాధపడాలా..?

ABN , First Publish Date - 2023-11-07T21:51:11+05:30 IST

దివ్యాంగుల్లో చాలా మంది తమలోని టాలెంట్‌కి పదును పెట్టి పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. మరికొందరు మీ కంటే మేమేం తక్కువ కాదంటూ.. అన్ని రంగాల్లోనూ పోటీపడి మరీ దూసుకెళ్తుంటారు. అయితే ఇంకొందరు దివ్యాంగులు మాత్రం...

Shocking Video: చేతులు లేకున్నా ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అవ్వాలా..? లేక తప్పు చేస్తున్నాడని తెలిసి బాధపడాలా..?

దివ్యాంగుల్లో చాలా మంది తమలోని టాలెంట్‌కి పదును పెట్టి పది మందిలో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. మరికొందరు మీ కంటే మేమేం తక్కువ కాదంటూ.. అన్ని రంగాల్లోనూ పోటీపడి మరీ దూసుకెళ్తుంటారు. అయితే ఇంకొందరు దివ్యాంగులు మాత్రం తమ టాలెంట్‌ని వృథా పనులకు కేటాయిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. చేతులు లేకున్నా ఓ కుర్రాడు తన ప్రతిభను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇతని టాలెంట్‌కు ఫిదా అవ్వాలో.. లేక తప్పు చేస్తున్నందుకు బాధపడాలా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. చేతులు లేని లేని ఓ కుర్రాడి ప్రతిభ చూసి (disabled person) కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరు తప్పు పడుతున్నారు. మెట్లపై కూర్చున్న అతను.. జేబులో నుంచి రెండు గుట్కా ప్యాకెట్లను (Gutka packets) బయటికి తీస్తాడు. వాటిలో ఓ ప్యాకెట్‌ని నోటితో పట్టుకుని, మరో ప్యాకెట్‌ని కాలి వేళ్లతో పట్టుకుని ఉంటాడు. ఓపెన్ చేసిన రెండు ప్యాకెట్లను కలిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఎంతో చాకచక్యంగా నోటిలోని ప్యాకెట్‪‌ను ఓ చేత్తో పట్టుకుని.. మరో ప్యాకెట్‌లోని గుట్కాను కాలి వేళ్లతో ఎంతో జాగ్రత్తగా మారుస్తాడు.

Shocking Video: భయమనేదే దీని బ్లడ్‌లో లేదనుకుంటా.. అనకొండను తొక్కుకుంటూ ఈ వింత జంతువు ఎలా వెళ్లిందో చూస్తే..!

చివరకు రెండింటిలోని గుట్కాను ఒకే ప్యాకెట్‌లో మిక్స్ చేసి, చివరగా దాన్ని మూసేసి జేబులో పెట్టుకుంటాడు. ఓ చేయి పూర్తిగా లేకపోవడంతో పాటూ మరో చేయి వైకల్యానికి గురైనా.. అతడి టాలెంట్‌ మాత్రం మిగతా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అతడు గుట్కా తీసుకోవడాన్ని మాత్రం చాలా మంది తప్పు పడుతున్నారు. ‘‘తమ్ముడూ.. నీ టాలెంట్ సూపర్.. కానీ ఇలాంటి అలవాట్లు చాలా ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘దురవాట్లకు దూరంగా ఉండు మిత్రమా’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ టాలెంట్‌ని మంచి పనులకు ఉపయోగించు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అల్లావుద్దీన్ చాపకు టెక్నాలజీ జోడించిన యువకుడు.. రోడ్డుపై ఎలా దూసుకెళ్తున్నాడో చూడండి..

Updated Date - 2023-11-07T21:51:12+05:30 IST