Share News

Shocking Video: గోడకు వేళాడుతున్న జాకెట్.. కర్రపుల్లతో దాన్ని కదిపితే.. లోపలి నుంచి ఏం బయటకు వచ్చాయో చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-08T16:55:08+05:30 IST

పాడుబడ్డ ఇళ్లల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. శిథిలాలను తొలగించే క్రమంలో బంగారు నాణేలు కొన్నిసార్లు బయటపడితే.. ఇంకొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు ..

Shocking Video: గోడకు వేళాడుతున్న జాకెట్.. కర్రపుల్లతో దాన్ని కదిపితే.. లోపలి నుంచి ఏం బయటకు వచ్చాయో చూస్తే..!

పాడుబడ్డ ఇళ్లల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. శిథిలాలను తొలగించే క్రమంలో బంగారు నాణేలు కొన్నిసార్లు బయటపడితే.. ఇంకొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు విషసర్పాలు బయటపడడం కూడా చాలా సార్లు చూశాం. అయితే ఇంకొన్నిసార్లు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇల్లు శుభ్రం చేస్తుండగా గోడకు తగిలించి ఉన్న జాకెట్‌ను విదిలించారు. దీంతో లోపలికి నుంచి బయటికి వచ్చిన వాటిని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఇళ్లు శుభ్రం చేస్తున్న సమయంలో వింత వింత వస్తువులు, పాములు, ఎలుకలు, బొద్దింకలు బయటపడడం సర్వసారాణంగా జరుగుతుంటుంది. అయితే ఊహించని ప్రదేశాల్లో ఊహించని వస్తువులు, జీవులు బయటపడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ఓ ఇంట్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇల్లు శుభ్రం చేసే క్రమంలో గోడకు తగిలించి ఉన్న జాకెట్‌ను విదిలించబోయాడు. అయితే అందులో ఏదో కదులుతున్నట్లు అనుమానం రావడంతో కర్ర తీసుకుని పరిశీలించాడు. జాకెట్‌ను ఇలా తీయగానే లోపలి నుంచి ఎలుకలు కుప్పలు తెప్పలుగా బయటికి వచ్చాయి. అది కూడా ఒకటీ, రెండు కాదు.. (large number of rats came out of the jacket) ఏకంగా పదుల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి.

Shocking Video: చేతులు లేకున్నా ఈ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అవ్వాలా..? లేక తప్పు చేస్తున్నాడని తెలిసి బాధపడాలా..?

కోటును విదిలించడంతో చాలా ఎలుకలు.. కుప్పలు కుప్పలుగా ఒక్కసారిగా కిందపడ్డాయి. అయితే అన్ని ఎలుకలు జాకెట్‌లో ఉన్నా ఏ ఎలుకా దాన్ని కొరికే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో ఇంటి యజమాని హమ్మయ్య!.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చలి ఎక్కువగా ఉండడంతో కోటులో దాక్కున్నాయి’’.. అని కొందరు, ‘‘కోటును కొరకలేదు.. సంతోషించాల్సిన విషయమే’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! ఇలాంటి సీన్ ఎప్పుడూ చూల్లేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking Video: గ్యాస్ సిలిండర్‌ను కట్ చేసి చూస్తే.. కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు..!

Updated Date - 2023-11-08T16:55:09+05:30 IST