Share News

Shocking: 14 ఏళ్ల బాలికతో పాటు స్టేషన్‌కు వచ్చిందో మహిళ.. మా పక్కింటి అమ్మాయేనంటూ ఆమె చెప్పింది విని అందరికీ షాక్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-09T15:41:52+05:30 IST

ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ.. తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే పరిస్థితులు లేని సమాజం ఇది. అయితే కొందరి విషయంలో అయితే ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొందరు...

Shocking: 14 ఏళ్ల బాలికతో పాటు స్టేషన్‌కు వచ్చిందో మహిళ.. మా పక్కింటి అమ్మాయేనంటూ ఆమె చెప్పింది విని అందరికీ షాక్.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహిళ.. తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే పరిస్థితులు లేని సమాజం ఇది. అయితే కొందరి విషయంలో అయితే ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొందరు యువతులకు సోదరుల రూపంలో సమస్యలు తలెత్తితే.. మరికొందరికి తండ్రి రూపంలో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి ఘటనలు నిత్యం మన చుట్టూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ బాలిక దిగాలుగా ఉండడంతో.. ‘‘ఎందుకు ఇలా ఉన్నావ్.. ఏమైందమ్మా’’.. అంటూ పక్కింటి మహిళ అడిగింది. దీంతో చివరకు ఆ బాలిక వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన దారుణాన్ని తెలియజేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) జెహానాబాద్ జిల్లా షకురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, కుమార్తె ఉన్నారు. అతను కొన్ని నెలల కిందటి వరకూ వేరే రాష్ట్రంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి... భార్యా పిల్లలను యోగక్షేమాలు చూసుకుని వెళ్తుండేవాడు. ఇలా సాగుతుండగా.. కొన్ని నెలల కిందట అతడి భార్య అనారోగ్య కారణంగా చనిపోయింది. దీంతో ఆ తర్వాత అతను సొంతూరులోనే ఉంటూ కూతురును చూసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడి బుద్ధి పక్కదారి పట్టింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే కన్నేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై (Father Indecent behavior towards daughter) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయంతో ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.

Shocking Video: భగవంతుడా.. ఈ తల్లికి ఏంటీ శిక్ష..? సరిగ్గా నిలబడలేదు కానీ కొడుకును మోసుకుంటూనే..!

ఆ తర్వాత తరచూ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. తండ్రి పెట్టే చిత్రహింసలు భరిస్తూ.. లోలోపలే నరకం అనుభవించేది. ఇటీవల వేధింపులు మరీ ఎక్కవ అవడంతో తట్టుకోలేకపోయింది. ఓ రోజు పక్కింటి మహిళ.. ‘‘ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావ్’’.. అని అడగడంతో బోరున విలపిస్తూ జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో చివరకు ఆమె బాలికను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు నిందితుడి ఆస్తిని లాక్కోవడానికి అతడి భార్య బంధువులు కావాలని ఇదంతా చేస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఆకట్టుకుంటున్న కుక్కర్ వాలా కాఫీ.. మరిగించకుండానే వేడి వేడి కాఫీని ఎలా చేశాడో చూడండి..

Updated Date - 2023-11-09T15:41:54+05:30 IST