Share News

Viral Video: ఆకట్టుకుంటున్న కుక్కర్ వాలా కాఫీ.. మరిగించకుండానే వేడి వేడి కాఫీని ఎలా చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2023-11-08T21:59:58+05:30 IST

వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు. ఇంకొందరు కొత్త కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: ఆకట్టుకుంటున్న కుక్కర్ వాలా కాఫీ.. మరిగించకుండానే వేడి వేడి కాఫీని ఎలా చేశాడో చూడండి..

వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు. ఇంకొందరు కొత్త కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టీ, కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి.. అందరిలా కాకుండా వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నాడు. కాఫీ, టీకి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుని సైకిల్‌పై బయలుదేరాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. అతడు కాఫీ చేసే విధానం (Tea and coffee making) చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ కప్పులు తీసుకుని అందులో పాలు, డికాషన్, చక్కెర కలిపాడు. మరోవైపు సైకిల్‌పై ప్రెజర్ కుక్కర్‪‌కు (Pressure cooker) ఉంచి, దానికి ఓ ప్రత్యేక నాబ్ ఏర్పాటు చేశాడు. చివరగా కలిపి ఉంచుకున్న పాలు, డికాషన్, చక్కెర మిశ్రమంలో కుక్కర్ నాబ్ ద్వారా ఆవిరితో కూడిని నీటిని నింపేస్తాడు.

Shocking Video: భగవంతుడా.. ఈ తల్లికి ఏంటీ శిక్ష..? సరిగ్గా నిలబడలేదు కానీ కొడుకును మోసుకుంటూనే..!

ప్రెజర్ కుక్కర్ వల్ల చివరకు చివరకు హాట్ హాట్క్ కాఫీ సిద్ధమైపోతుంది. ఈ కాఫీ ఎంతో రుచిగా ఉండడంతో తాగిన వారంతా మళ్లీ మళ్లీ అతడి వద్దకే వస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! చూస్తుంటేనే తాగాలి అనిపిస్తోంది’’.. అని కొందరు, ‘‘కుక్కర్ కాఫీ సూపర్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, ‘‘తెలివి ఒకరి సొత్తు కాదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Funny Video: ఈ కుర్రాడెవరో కానీ.. కడుపుబ్బా నవ్వించేశాడుగా.. మెట్రో‌ రైల్లో ఇద్దరి మధ్య కూర్చుని సడన్‌గా షాకిచ్చాడు..!

Updated Date - 2023-11-08T21:59:59+05:30 IST