Share News

Viral News: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా..? రోజుకు 50 వరకు సిగరెట్లు తాగే ఈ పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-10T18:32:24+05:30 IST

స్మోకింగ్ బేబీ అనే పేరు తెలియని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదు. 11 ఏళ్ల కిందటే ఈ పేరు నెట్టింట ఎంతో ఫేమస్ అయింది. రెండేళ్ల వయసున్న ఓ బుడ్డోడు పెద్దవాళ్ల తరహాలో నోట్లో సిగరెట్ పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీల్చడం చూసి అప్పట్లో...

Viral News: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా..? రోజుకు 50 వరకు సిగరెట్లు తాగే ఈ పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే..!

స్మోకింగ్ బేబీ అనే పేరు తెలియని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదు. 11 ఏళ్ల కిందటే ఈ పేరు నెట్టింట ఎంతో ఫేమస్ అయింది. రెండేళ్ల వయసున్న ఓ బుడ్డోడు పెద్దవాళ్ల తరహాలో నోట్లో సిగరెట్ పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీల్చడం చూసి అప్పట్లో ప్రపంచం మొత్తం నివ్వెరబోయింది. ఇండోనేషియాలో ఎక్కువ శాతం చిన్న పిల్లలకు ఈ అలవాటు ఉన్నా.. ఈ బుడ్డోడు మాత్రం ఎంతో ఫేమస్ అయ్యాడు. అప్పట్లో రోజుకు 50 సిగరెట్టు తాగే ఈ పిల్లాడు.. ప్రస్తుతం ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ బాలుడికి సంబంధించిన ప్రస్తుత ఫొటోలు సోషల్ మీడియలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇండోనేషియాకు (Indonesia) చెందిన బాలుడిని అల్ది సుగంద, ఆల్ది రిజాల్, ‘‘స్మోకింగ్ బేబీ (Smoking baby) ఆఫ్ ఇండోనేషియా’’ అని కూడా పిలుస్తారు. దక్షిత సుమత్రాలోని తేలుక్ కెమాంగ్ సుంగై లిలిన్ గ్రామంలో ఉంటున్న ఈ బాలుడికి ఇప్పుడు 13 సంవత్సరాల వయస్సు. ఆల్ది పాఠశాలలో బుద్ధిగా చదువుకుంటూ మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నాడు. అయితే బాలుడు ఈ స్థాయికి వచ్చేందుకు చాలా సంవత్సాలు పట్టింది. ఇందులో దేశంలోని ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్, దేశ జాతీయ కమిషన్ చైర్మన్ అయిన డాక్టర్ సెటో ముల్యాడి పాత్ర ఎంతో ఉంది. అతను బాలుడి జీవితాన్ని పూర్తిగా మార్చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Indian Railway: ఇలాంటోళ్లను అసలేం చేయాలి..? రైల్వే పట్టాలపై ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకమేంటో చూస్తే..!

బాలుడు తాగే సిగరెట్ల సంఖ్యను క్రమ క్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. అలాగే పిల్లాడిని రన్నింగ్, వివిధ రకాల ఆటల వైపు మళ్లించాడు. ఇలా కొన్ని నెలల పాటు బాలుడిని దగ్గరుండి పర్యవేక్షించారు. నాలుగేళ్ల వయసులో ఆల్ది సిగరెట్ అలవాటును పూర్తిగా పక్కన పెట్టేశాడు. బాలుడు మాట్లాడుతూ తాను ధూమపానం చేసేవారిని చూస్తుంటానని చెప్పాడు. ధూమపానం చేస్తున్నప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని, అయితే ప్రస్తుతం ధూమపానం కంటే చాక్లెట్ మంచిదని తాను భావిస్తున్నట్లు చెబుతున్నాడు.

smoking-baby-viral.jpg

Success Story: ఇది కదా సక్సెస్ అంటే.. ఒకప్పుడు జాబ్‌లోంచి తీసేశారు.. ఇప్పుడు ఈయనే 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు..!

2014 గ్లోబల్ యూత్ టుబాకో సర్వే ప్రకారం 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల ఇండోనేషియన్లలో 20 శాతం మంది పొగతాగుతున్నారు. అలాగే దేశం మొత్తం మీద ప్రతి రోజూ 267,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడుతున్నారని తెలిసింది. అదేవిధంగా ఇండోనేషియాలోని ఐదు నగరాల్లోని 85 శాతం పాఠశాలలు సిగరెట్ ప్రకటనలతో నిండిపోయినట్లు 2015 సర్వే కనుగొంది. కాగా, ఇండోనేషియా స్మోకింగ్ బేబీకి సంబంధించిన ప్రస్తుత ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ మారుతున్నాయి. బాలుడిని మంచి మార్గంలోకి నడిపించిన డాక్టర్‌ను అభినందిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Indonesia-smoking-baby.jpg

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!

Updated Date - 2023-11-10T18:32:28+05:30 IST