Share News

Success Story: ఇది కదా సక్సెస్ అంటే.. ఒకప్పుడు జాబ్‌లోంచి తీసేశారు.. ఇప్పుడు ఈయనే 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు..!

ABN , First Publish Date - 2023-11-09T21:47:07+05:30 IST

చాలా మంది ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోరాడుతుంటారు. మరికొందరు ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని నిరాశ, నిస్పృహతో జీవనం సాగిస్తుంటారు. అయితే కేవలం కొందరు మాత్రమే.. తాము పైకి రావడమే కాకుండా, పది మందికీ ఉపాధి కల్పిస్తుంటారు. ఇలాంటి...

Success Story: ఇది కదా సక్సెస్ అంటే.. ఒకప్పుడు జాబ్‌లోంచి తీసేశారు.. ఇప్పుడు ఈయనే 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు..!

చాలా మంది ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పోరాడుతుంటారు. మరికొందరు ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని నిరాశ, నిస్పృహతో జీవనం సాగిస్తుంటారు. అయితే కేవలం కొందరు మాత్రమే.. తాము పైకి రావడమే కాకుండా, పది మందికీ ఉపాధి కల్పిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల జీవితాన్ని గమనిస్తే.. ఇది కదా సక్సెస్ అంటే.. అని అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతాడు. ఉద్యోగం నుంచి తీసేశారని నిరాశచెందకుండా పంతం పెంచుకున్నాడు. ఎలాగైనా సొంత కాళ్ల మీద నిలబడాలని బలంగా నిర్ణయించుకున్నాడు. చివరకు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడమే కాకుండా సుమారు 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెరైటీ ఐడియాతో లక్షలు సంపాదిస్తున్న ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలీలోని దేహ్ పోలీస్ స్టేషన్ పరిధి లోధ్వరీ గ్రామానికి చెందిన సోనూ శ్రీవాస్తవ.. కొన్నేళ్ల క్రితం ఫొటో స్టూడియోలోని కలర్ ల్యాబ్‌లో టెక్నికల్ ఇంజనీర్‌గా పని చేస్తుండేవాడు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగుతున్న అతడి జీవితంలో కరోనా మహమ్మారి (Corona) ఓ కుదుపు కుదిపింది. చాలా మంది మాదిరే శ్రీవాస్తవ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఉద్యోగం నుంచి తొలగించడంతో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి చేరాడు. ఏం చేయాలో తెలీక చాలా రోజుల పాటు ఆలోచించసాగాడు. చివరికి ఎలాగైనా ఏదో ఒక వ్యాపారం చేసి తన గత జీవితం కంటే ఉన్నతంగా జీవించాలని బలంగా నిర్ణయించుకున్నాడు.

Shocking: 32 ఏళ్ల ఆ మహిళ బాత్రూంలోనే ఎలా చనిపోయింది..? పోస్ట్‌మార్టం రిపోర్టుతో వీడిన డెత్ మిస్టరీ.. ఏం తేల్చారంటే..!

543.jpg

ఈ క్రమంలో ఆగ్రా నగరాన్ని సందర్శిచడానికి వెళ్లిన సమయంలో అతను అక్కడి ప్రాంతంలో ఫేమస్ అయిన పేటా (Agra Peta sweet) అనే స్వీట్‌ని రచి చూశాడు. అది అతడికి ఎంతో నచ్చింది. దీన్నే తన సొంతూర్లో ఎందుకు తయారుచేయకూడదు.. అని తనకు తాను ప్రశ్న వేసుకున్నాడు. తర్వాత అక్కడ పేటా తయారు చేసే వారి నుంచి మెలకువలు నేర్చుకున్నాడు. అనంతరం ఇంటికి వచ్చి సొంతంగా పనులు ప్రారంభించాడు. ఇందుకోసం మొదట తక్కువ స్థాయిలో తెల్ల గుమ్మడికాయలను (White pumpkins) కొనుగోలు చేసి కొద్ది మందిని నియమించుకుని పేటా స్వీట్ తయారు చేయడం మొదలెట్టాడు. ఇలా మొదలైన తన వ్యాపార ప్రస్తానం ప్రస్తుతం రాష్ట్ర నలుమూలలకు వరకూ విస్తరించింది.

agra-petha-sweet.jpg

Indian Railway: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాదండోయ్.. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న 5 ట్రైన్ల లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం శ్రీవాస్తవ వద్ద వంద మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. తెల్ల గుమ్మడికాయలను చిన్న చిన్న ముక్కులుగాత కట్ చేయడం, తర్వాత వాటిని పెద్ద బాణిలో ఉడికిస్తారు. చివరకు అందులో చక్కెరను మిక్స్ చేయడం ద్వారా పేటా స్వీట్‌ను సిద్ధం చేస్తారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ, ప్రస్తుతం తన వద్ద తయారైన స్వీటుకు మంచి డిమాండ్ ఉందన్నారు. రాయ్‌బరేలీ, ఫతేపూర్, ప్రతాప్‌గఢ్, కౌష్బీ, సుల్తాన్‌పూర్, అమేథీ, సహా యూపీలోని అనేక జిల్లాలకు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.8నుంచి రూ.9లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు శ్రీవాస్తవ చెబుతున్నాడు. ఉద్యోగం పోయిందని కుంగిపోకుండా.. సొంత కాళ్ల మీద ఎదిగి ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న శ్రీవాస్తవ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

success-storyes.jpg

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!

Updated Date - 2023-11-09T21:47:11+05:30 IST