Share News

Viral Video: ఇలాంటి కారును దివ్యాంగులు కూడా అద్భుతంగా నడపొచ్చు.. ఈ టెక్నాలజీపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-11-11T20:45:47+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనిషి చేయలేనిదంటూ ఏదీ లేదనే చెప్పొచ్చు. కొందరు తమ టాలెంట్‌కి పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంలో...

Viral Video: ఇలాంటి కారును దివ్యాంగులు కూడా అద్భుతంగా నడపొచ్చు.. ఈ టెక్నాలజీపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మనిషి చేయలేనిదంటూ ఏదీ లేదనే చెప్పొచ్చు. కొందరు తమ టాలెంట్‌కి పదును పెట్టి అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరచడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ముందుంటారు. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దివ్యాంగులు నడిపేందుకు వీలుగా తయారుచేసిన కారును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ టెక్నాలజీపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (businessman Anand Mahindra) షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీల్‌చైర్‌కి పరితమైన దివ్యాంగులు (disabled people) కారు నడపడం సాధ్యం కాదు. ఒకవేళ నడిపినా కారు దిగి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న పని. అయితే ఇలాంటి వారి కోసం నూతన టెక్నాలజీతో కూడిన కారు (new technology car) అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం కారు పైభాగంలో వృత్తాకర కాంపార్ట్‌మెంట్‌ని ఏర్పాటు చేశారు. కారు ఆగగానే ఒక్క బటన్ నొక్కితే చాలు.. పైనున్న కాంపార్ట్‌మెంట్ కారు డోరు వైపునకు తిరుగుతుంది.

Viral Video: రైలు బోగీలో సడన్‌గా యువకుడి వింత నిర్వాకంపై.. నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

తర్వాత కాంపార్ట్‌మెంట్ నుంచి వీల్ చైర్ బయటికి వచ్చి నేల మీద ల్యాండ్ అవుతుంది. దీంతో కారు దిగిన దివ్యాంగులు.. వీల్ చైర్‌లో కూర్చుని వెళ్లొచ్చన్నమాట. ఈ టెక్నాలజీ ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘సూపర్ స్మార్ట్, ఉపయోగకరమైన డిజైన్’’.. అని పేర్కొంటూ.. ఇలాంటి స్టార్టప్‌లలో తాను పెట్టుబడి పెడతానని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈ టెక్నాలజీ ఎంతో అద్భుతంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘వికలాంగులకు ఇలాంటి కారు ఎంతో ఉపయోగకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆన్‌లైన్ క్లాసులో టీచర్‌ను అడగకూడని ప్రశ్న అడిగిన విద్యార్థి.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

Updated Date - 2023-11-11T20:45:48+05:30 IST