Share News

Viral Video: కూతురి పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించిన తండ్రి.. కానీ కేక్‌ తెచ్చాడనుకుంటే.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..

ABN , First Publish Date - 2023-11-12T16:54:01+05:30 IST

పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మొదట గుర్తుకొచ్చేది కేక్. ఒకరినిమించి మరొకరు రకరకాల కేక్‌లు తెచ్చుకుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాగే వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు కూడా రకరకాల ఫ్లేవర్ కేకులను తయారు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం...

Viral Video: కూతురి పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించిన తండ్రి.. కానీ కేక్‌ తెచ్చాడనుకుంటే.. ఇతనేంటీ మరీ విచిత్రంగా..

పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మొదట గుర్తుకొచ్చేది కేక్. ఒకరినిమించి మరొకరు రకరకాల కేక్‌లు తెచ్చుకుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాగే వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు కూడా రకరకాల ఫ్లేవర్ కేకులను తయారు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం రొటీన్‌కి భిన్నంగా వేడుకులు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిన్నారి పుట్టిన రోజుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కూతురు మొదటి పుట్టిన రోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించాడు. అయితే కేక్ స్థానంలో అతడు తెచ్చిన ఆహార పదార్థాలను చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కూతురు మొదటి పుట్టిన రోజు (First birthday) వేడుకను వినూత్నంగా నిర్వహించాలని అనుకున్నాడు. అందరిలా కేక్‌లు (cake) కాకుండా వెరైటీగా నిర్వహించాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. కేక్‌ల స్థానంలో మాంసాహార వంటకాలను (Meat products) సిద్ధం చేశాడు. ఆర్గానిక్ వెన్నతో తయారు చేసిన వివిధ రకాల మాంసాహారంతో పాటూ ఎండ్రకాయల మాంసాన్ని కూడా సిద్ధం చేశాడు. తన కూతురు ముందు వాటిని ఉంచి కొవ్వొత్తి వెలిగించాడు.

Viral Video: యజమాని అడిగిన గణిత ప్రశ్నలకు.. ఈ కుక్క ఎలా సమాధానం చెబుతోందో చూడండి..

తర్వాత అందులోని మాంసం ముక్కను చిన్నారి నోట్లో పెట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. ఇలా అతను తన కూతురి మొదటి పుట్టిన రోజును వినూత్నంగా నిర్వహించాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏడాది వయసున్న పాపకు ఇలాంటి పదార్థాలు పెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చిన్న పిల్లలకు ఇలాంటి పెట్టడం ఏంటీ’’.. అని కొందరు, ‘‘మా పిల్లలకు ఇలాంటి మాంసం పెట్టడం సాధ్యం కాదు’’.. అని మరికొందరు, ‘‘ఇది నిజంగా వెర్రితనం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం.. చివరకు కత్తితో కోసి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - 2023-11-12T16:55:45+05:30 IST