Share News

Viral Video: చావు తెలివితేటలంటే ఇవే.. రెస్టారెంట్‌లో బిల్లును ఎగ్గొట్టేందుకు ఓ యువతి వెరైటీ ప్లాన్.. సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో..!

ABN , First Publish Date - 2023-11-14T15:35:36+05:30 IST

కొందరి కక్కుర్తితో చేసే పనులు కొన్నిసార్లు ఎదుటి వారికి కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అలాగే మరికొందరు డబ్బులు ఆదా చేసేందుకు మరీ నీచమైన పనులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ...

Viral Video: చావు తెలివితేటలంటే ఇవే.. రెస్టారెంట్‌లో బిల్లును ఎగ్గొట్టేందుకు ఓ యువతి వెరైటీ ప్లాన్.. సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో..!

కొందరి కక్కుర్తితో చేసే పనులు కొన్నిసార్లు ఎదుటి వారికి కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అలాగే మరికొందరు డబ్బులు ఆదా చేసేందుకు మరీ నీచమైన పనులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి హోటల్లో బిల్లు ఎగ్గొట్టేందుకు వెరైటీ ప్లాన్ వేసింది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) తన స్నేహితుడితో కలిసి ఓ హోటల్‌కి (Hotel) వెళ్తుంది. ఇద్దరూ తమకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ (Food order) చేస్తారు. ఆర్డర్ రాగానే ఎంచక్కా లాగించేస్తారు. అయితే, ఏదోటి చేసి బల్లు ఎగ్గొట్టాలనే ఉద్దశంతో యువతి రకరకాలుగా ఆలోచిస్తుంది. చివరకు ఆమెకు ఓ వెరైటీ ఐడియా వస్తుంది. అదే ఆలోచనను తన స్నేహితుడికి చెబుతుంది. ‘‘బిల్లు ఎగ్గొంటేందుకు నేను ఓ మాస్టర్ ప్లాన్ వేశా’’.. అని చెబుతుంది. ఇందుకు అతను ‘‘ఇంతకీ వర్క్‌అవుట్ అవుతుందంటావా’’.. అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు.

Viral Video: క్లాస్ రూమ్‌లో టీచర్‌కి సడన్ షాక్.. విద్యార్థులు గొడవపడుతున్నారంటూ లోపలికి తీసుకెళ్లి.. ఉన్నట్టుండి..

భోజనం చేశాక చివర్లో తన తలలోని వెంట్రుకలను లాగి, వాటిని తన స్నేహితుడి ప్లేటులో వేస్తుంది. చివరగా హోటల్ సిబ్బందిని పిలిచి.. ఆహారంలో వెంట్రుకలు ఏంటయ్యా.. అంటూ గొడవకు దిగుతుంది.ఇలా వారితో గొడవ పెట్టుకుని బిల్లు కట్టకుండా ఇద్దరూ బయటికి వెళ్లిపోతారు. అయితే వారు వెళ్లిన తర్వాత హోటల్ సిబ్బందికి అనుమానం కలుగుతుంది. దీంతో సీసీ కెమెరా ఫుజేజీని పరిశీలించగా.. మొత్తం విషయం బయటకు వస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మరీ ఇంత కక్కుర్తి పనికిరాదమ్మా’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం వల్ల నిజం చెప్పే వారిపై కూడా అనుమానం కలుగుతుంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కొండచిలువ కడుపులో ఏదో పెద్ద జంతువు ఉన్నట్లు అనుమానం.. చివరకు కత్తితో కోసి చూడగా.. షాకింగ్ సీన్..

" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true" loading="lazy">

Updated Date - 2023-11-14T15:41:45+05:30 IST