Share News

Viral Video: వంట చేసేందుకు సిద్ధమైన వ్యక్తికి.. ఊహించని షాక్ ఇచ్చిన కోడి.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2023-11-17T20:22:14+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యగంలో ఒకే ఒక్క ఘటన.. క్షణాల్లో ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేయగలదు. ఎక్కడెక్కడో చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు కూడా చూస్తుండగానే నెట్టింట్లోకి చేరిపోతుంటాయి. వీటిలో కొన్ని బాధ కలిగిస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే...

Viral Video: వంట చేసేందుకు సిద్ధమైన వ్యక్తికి.. ఊహించని షాక్ ఇచ్చిన కోడి.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ప్రస్తుత సోషల్ మీడియా యగంలో చిన్న ఘటన కూడా.. క్షణాల్లో ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేయగలదు. ఎక్కడెక్కడో చోటు చేసుకునే చిన్న చిన్న ఘటనలు చూస్తుండగానే నెట్టింట్లోకి చేరిపోతుంటాయి. వీటిలో కొన్ని బాధ కలిగిస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే కొన్ని కోపాన్ని తెప్తిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వంట చేసేందుకు సిద్ధమైన వ్యక్తికి.. ఓ కోడి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇంటి ముందు ప్లాస్టిక్ డ్రమ్ముపై కరెంట్ పొయ్యి ఏర్పాటు చేసి, వంట చేసేందుకు సిద్ధమవుతాడు. ముందుగా వంట పాత్రలో నూనె వేసి వేయిస్తాడు. అయితే అదే సమయంలో ఓ కోడి (Chicken laying an egg) అతడి రేకుల ఇంటిపై గుడ్డు పెడుతూ ఉంటుంది. సరిగ్గా అతను వంట పాత్రలో నూనె వేయగానే.. ‘‘ఇదిగో.. గుడ్డు పంపిస్తున్నా.. ఫ్రై చేసుకో’’.. అన్నట్లుగా కోడి పెట్టిన గుడ్డు రేకుల పైనుంచి దొర్లుకుంటూ వచ్చి వంట పాత్రలో పడుతుంది.

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

పైనుంచి గుడ్డు పడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. ‘‘వామ్మో!.. పైనుంచి ఏదో పడిందేంటీ’’.. అనుకుని దగ్గరికి వెళ్లి చూస్తాడు. అయితే తర్వాత అసలు విషయం తెలుసుకుని.. ‘‘వెతకబోయే గుడ్డు.. పాత్రలోకి వచ్చి చేరింది’’.. అనుకుంటూ గుడ్డు పెంకులను పక్కన పడేసి, సంతోషంగా వేపుడు చేసుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అరే! ఇదేదో బాగుందే’’.. అని ఇంకొందరు, ‘‘వంట చేసిపెట్టాలని గుడ్డు పంపిందేమో’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బస్సులో భార్యకు సీటు లేకపోవడంతో భర్త వెరైటీ ప్లాన్.. చివరకు వారు చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

Updated Date - 2023-11-17T20:22:16+05:30 IST