Share News

Funny Video: ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న ప్రియుడు.. అటుగా వెళ్తూ చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-22T18:57:52+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉపాధి దొరుకుతోంది. కొందరు తమ టాలెంట్‌కి పదునుపెట్టి ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వివిధ మార్గాల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు వివిధ రకాల వీడియోలు చేస్తూ...

Funny Video: ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతున్న ప్రియుడు.. అటుగా వెళ్తూ చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ఉపాధి దొరుకుతోంది. కొందరు తమ టాలెంట్‌కి పదునుపెట్టి ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వివిధ మార్గాల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు వివిధ రకాల వీడియోలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటే.. ఇంకొందరు ఫన్నీ, ప్రాంక్ వీడియోలు చేసి కూడా ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. తన ప్రియుడు ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముతుండడం చూసి ఓ యువతి అవాక్కైంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కూరగాయలు (vegetables) అమ్ముతుంటాడు. అదే సమయంలో అతడి ప్రియురాలు అటుగా వెళ్తుంటుంది. కూరగాయలు అమ్ముతున్న ప్రియుడిని చూసి ఆమె ఒక్కసారిగా ఖంగుతింటుంది. ‘‘ఇతనేంటీ.. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నాడు’’.. అనుకుంటూ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. ఆమెను చూడగానే యువకుడు కూడా షాక్ అవుతాడు. కూరగాయలు అమ్మే విషయంలో (Quarrel between lovers) ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. దీంతో యువతి ఆగ్రహానికి గురై... పక్కనే ఉన్న చీపురు తీసుకుని అతడిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది.

KBC Show: పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు.. రూ.7 కోట్లను గెలిచే ఛాన్స్ తృటిలో మిస్సయింది కానీ..!

అయితే అతడు మాత్రం ‘‘కూరగాయలు అమ్మితే తప్పేముందీ’’.. అని అనుకుంటూ ఆమె చేతిలోని చీపురు లాక్కుని పక్కకు లాక్కెళ్తాడు. తర్వాత యథావిధిగా ఫుట్‌పాత్‌పై కూర్చుని తమ సమస్యను అక్కడే ఉన్న వారికి వివరిస్తాడు. దీంతో వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. మరికొందరు ఈ ప్రేమికుల గొడవను చూసి నవ్వుకుంటుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వీడియో మొత్తం స్క్రిప్టెడ్’’.. అంటూ కొందరు, ‘‘స్క్రిప్టెడ్ అయినా చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇద్దరు పోలీసులకు వింత శిక్ష.. గడ్డి కోయండంటూ హైకోర్టు ఆదేశాలు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-11-22T18:57:53+05:30 IST