Share News

Viral Video: నన్నెవరో కిడ్నాప్ చేశారంటూ విమానంలో ఓ మహిళ రచ్చ రచ్చ.. సీట్లపైకి ఎక్కి దూకుతూ..!

ABN , First Publish Date - 2023-11-23T20:00:43+05:30 IST

ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రయాణికులు సీట్ల కోసం కుస్తీ పట్టడం చూస్తూ ఉంటాం. అలాగే కొందరు ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో...

Viral Video: నన్నెవరో కిడ్నాప్ చేశారంటూ విమానంలో ఓ మహిళ రచ్చ రచ్చ.. సీట్లపైకి ఎక్కి దూకుతూ..!

ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రయాణికులు సీట్ల కోసం కుస్తీ పట్టడం చూస్తూ ఉంటాం. అలాగే కొందరు ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో చివరకు బస్సు, రైళ్లను ఆపిన సందర్భాలు కూడా చాలా చూశాం. అయితే తాజాగా, ఓ విమానంలో చోటు చేసుకున్న విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. నన్నెవరో కిడ్నాప్ చేశారంటూ రచ్చ రచ్చ చేసింది. చివరకు ఏం జరిగిందంటే..

హ్యూస్టన్ నుంచి డెన్వర్‌కు వెళ్లే ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ (Houston to Denver Flight) విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 16న హ్యూస్టన్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను ఎక్కించుకున్న విమానం డెన్వర్‌ వైపు పయనమైంది. అయితే గాల్లోకి లేచిన కొద్ది సేపటికి విమానంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా సైలెంట్‌గా సీట్లో కూర్చున్న మహిళ.. ఒక్కసారిగా పైకి లేచి వీరంగం సృష్టించింది. వెంట్రుకలు విరబోసుకున్న మహిళ.. సీటు నుంచి పైకి లేచి, ‘‘ఎవరో నన్ను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వెళ్లిపోండీ.. నన్ను వేధించొద్దు’’.. అంటూ గట్టిగా (Woman screams on plane) అరవడం మొదలెట్టింది. మధ్య మధ్యలో ఆమె ఒక్కసారిగా గట్టిగా అరవడం, ఏడవడం చూసి అంతా అవాక్కయ్యారు.

Snake Woman: పాములంటే ఇంత ఇష్టమేంటి తల్లీ.. 16 ఏళ్ల వయసు నుంచే ఈ యువతి ఏం చేస్తోందంటే..!

విమానంలో ఏం జరుగుతుందో అర్థం కాక కొందరు మహిళలు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపటి తర్వాత.. ‘‘ఈ విమానంలో దుష్టశక్తి ఉంది.. అది అందరినీ చంపేస్తుంది’’.. అంటూ అరుస్తూ ఉంది. తర్వాత ఏసుక్రీస్తును స్మరిస్తూ ప్రార్థనాలు చేసింది. పక్కన ఉన్న మహిళలు ఆమెకు సర్దిచెప్పాలని ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. కాసేపటి తర్వాత ఓ మహిళ అక్కడికి వెళ్లి సదరు మహిళను కౌగిలించుకుని ఓదార్చింది. అయినా మళ్లీ పక్కన ఉన్న ప్రయాణికుల సీట్లపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. చివరకు విమానాన్ని డల్లాస్‌లో ల్యాండ్ చేసి, ఆమెను పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ దెబ్బకు.. ఆ కంపెనీయే దివాళా తీసేట్టుందిగా.. ఆటో వెనుక అసలేం రాశాడో చూస్తే..!

Updated Date - 2023-11-23T20:00:46+05:30 IST