Share News

Viral Video: ఈ ప్రేమ జంట నిర్వాకానికి పానిపూరీ వ్యాపారికి మైండ్‌బ్లాక్.. ఖాళీ పూరీని ఆమె నోట్లో పెట్టుకుంటే..!

ABN , First Publish Date - 2023-11-25T19:45:29+05:30 IST

‘‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’’.. అన్న సామెత చందంగా.. కొందరు ఆకతాయిలు తమ పైత్యాన్ని మొత్తం వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలోకి వదులడం సర్వసాధారణమైంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇటీవల...

Viral Video: ఈ ప్రేమ జంట నిర్వాకానికి పానిపూరీ వ్యాపారికి మైండ్‌బ్లాక్.. ఖాళీ పూరీని ఆమె నోట్లో పెట్టుకుంటే..!

‘‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’’.. అన్న సామెత చందంగా.. కొందరు ఆకతాయిలు తమ పైత్యాన్ని మొత్తం వీడియోలుగా మార్చి సోషల్ మీడియాలోకి వదులడం సర్వసాధారణమైంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇటీవల ప్రేమికులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. కొందరు బైకుపై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకుంటుంటే.. మరికొందరు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పానీపూరీ తినడానికి వెళ్లిన ప్రేమికులు.. ఉన్నట్టుండి ప్రవర్తించిన తీరుకు అక్కడున్న వ్యాపారి మైండ్ బ్లాక్ అయింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) పానీపూరీ తినేందుకు వెళ్తుంది. పానీపూరీ (Panipuri) తీసుకున్న యువకుడు ముందుగా ఓ పూరీని తన ప్రియురాలికి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆమె అలా తినేందుకు ఇష్టపడదు. దీంతో అతను తన మానాన తాను తింటూ ఉంటాడు. దీంతో యువతికి కోపం వస్తుంది. ‘‘నేను చెప్పిందేంటీ.. నువ్వు చేస్తోందేంటీ’’.. అని అతడికి గుర్తు చేస్తూ.. పక్కనే ఉన్న ఖాళీ పూరీని తీసుకుంటుంది. దాని మధ్యలో రంధ్రం చేసి నోట్లో పెట్టుకుంటుంది.

Snake Video: కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయిన నాగుపాము.. కొడవలితో కాపాడుతోంటే దానిలో పెరిగిన భయం.. చివరకు..!

విషయం అర్థమైనట్లుగా సదరు యువకుడు తన వద్ద ఉన్న ప్లేటులోని పానీని మొత్తం నోట్లో పోసుకుంటాడు. తర్వాత దాన్ని మొత్తం తన ప్రియురాలి నోట్లోని పూరీలో పోస్తాడు. దీంతో మొదటి నుంచీ వీరి పిచ్చి చేష్టలు గమనిస్తూ ఉన్న వ్యాపారి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ‘‘వీళ్లేంట్రా.. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ తలను పక్కకు తిప్పుకొంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రేమికుల పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అని కొందరు, ‘‘మరీ ఇంత అసహ్యంగా.. ఇవేం పనులురా బాబూ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Indian Railway: చెప్పు తీసుకుని ఓ కుర్రాడిని చితకబాదిన యువతి.. రైల్లో అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-11-25T19:45:41+05:30 IST