Share News

Snake Video: కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయిన నాగుపాము.. కొడవలితో కాపాడుతోంటే దానిలో పెరిగిన భయం.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-25T19:12:58+05:30 IST

సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయకపోగా.. మరిన్ని సమస్యలు సృష్టించే మనుషులున్న రోజులివి. అయితే ఇలాంటి సమాజంలోనే.. మానవత్వం ఇంకా బతికే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. సాటి మనుషులతో పాటూ జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమానురాగాలను కురిపిస్తుంటారు. కష్టాల్లో...

Snake Video: కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయిన నాగుపాము.. కొడవలితో కాపాడుతోంటే దానిలో పెరిగిన భయం.. చివరకు..!

సాటి మనిషి కష్టాల్లో ఉంటే సాయం చేయకపోగా.. మరిన్ని సమస్యలు సృష్టించే మనుషులున్న రోజులివి. అయితే ఇలాంటి సమాజంలోనే.. మానవత్వం ఇంకా బతికే ఉందని కొందరు నిరూపిస్తుంటారు. సాటి మనుషులతో పాటూ జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమానురాగాలను కురిపిస్తుంటారు. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ నాగుపాము కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయి బయటికి రావడానికి ఇబ్బంది పడుతోంది. ఓ వ్యక్తి దాన్ని గమనించి కొడవలితో కాపాడే ప్రయత్నం చేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

కర్నాటకలో (Karnataka) చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఎలా వెళ్లిందో ఏమోగానీ ఓ నాగుపాము కొబ్బరి చెట్టు (snake stuck in coconut tree) తొర్రలోకి వెళ్లి ఇరుక్కుపోయిది. బయటికి రాలేక తెగ ఇబ్బంది పడింది. చావుబతుకుల మధ్య ఉన్న ఆ పామును అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనిస్తాడు. కొడవలి తీసుకుని దగ్గరికి వెళ్తాడు. పాము చుట్టూ ఉన్న కొబ్బరి చెట్టు మొదలును కొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే పాము ప్రాణ రక్షలో భాగంగా అతడిపై బుసలు కొడుతూ కాటేయడానికి ప్రయత్నిస్తుంది.

School Children: వీళ్లు పిల్లలు కాదు.. పిడుగులు.. పొలాల్లోకి వెళ్లి నాలుగే నాలుగు ఫొటోలతో నెట్టింట పెద్ద చర్చే పెట్టారుగా..!

పాము కాటేయడానికి ప్రయత్నిస్తున్నా.. ఆ వ్యక్తి మాత్రం పట్టువదలకుండా, పాముకు ఎలాంటి గాయం కాకుండా దాని చుట్టూ ఉన్న చెట్టు మొదలును తొలగిస్తాడు. పాము బయటికి వచ్చేందుకు వీలుగా చుట్టూ ఉన్న మొదలును తొలగిస్తాడు. చివరగా పాము తలను కర్రతో పట్టుకుని, తోక పట్టుకుని కిందకు లాగడంతో బయటకు వస్తుంది. కిందపడిన వెంటనే పాము చకచకా ముళ్లపొదల్లేకి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విష సర్పానికే ప్రాణం పోశాడు’’.. అంటూ కొందరు, ‘‘మీరు చాలా గ్రేట్ బ్రదర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Indian Railway: చెప్పు తీసుకుని ఓ కుర్రాడిని చితకబాదిన యువతి.. రైల్లో అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-11-25T19:12:59+05:30 IST