Share News

Viral: ఇలాంటి మహిళా పోలీసును ఎక్కడా చూసుండరు.. పసికందు ఏడుపు ఆపడానికి ఈమె ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-11-26T19:47:33+05:30 IST

పోలీసులంటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. ఎక్కడ లేనిపోని కేసులు పెట్టి, విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తారని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి పోలీసుల విషయం పక్కన పెడితే..

Viral: ఇలాంటి మహిళా పోలీసును ఎక్కడా చూసుండరు.. పసికందు ఏడుపు ఆపడానికి ఈమె ఏం చేసిందో తెలిస్తే..
ప్రతీకాత్మక చిత్రం

పోలీసులంటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. ఎక్కడ లేనిపోని కేసులు పెట్టి, విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తారని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి పోలీసుల విషయం పక్కన పెడితే.. కాఖీ చొక్కా వేసుకున్న వారిలోనూ కనికరం గల వారు ఎంతో మంది ఉంటారు. కొందరు సాటి మనుషుల పట్ల చూపించే ఆదరాభినాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, కేరళలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళా కానిస్టేబుల్ నవజాత శిశువును పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చింది. అయితే పసికందు ఉన్నట్టుండి ఏడుస్తుండడంతో చివరకు ఆమె ఏం చేసిందంటే..

కేరళలోని (Kerala) కొచ్చి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొచ్చి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు (Kochi Police Control Room) ఓ కాల్ వచ్చింది ఓ ఇంట్లో పిల్లలు గట్టిగా ఏడుస్తున్నారని, పెద్దవారు ఎవరూ లేరని అవతలి వ్యక్తులు చెప్పారు. దీంతో ఓ మహిళా కానిస్టేబుల్ (woman constable) సంఘటన స్థలానికి వెళ్లారు. సదరు ఇంటికి వెళ్లే సరికి లోపల నలుగురు పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. వారిలో నాలుగు నెలల పసికందు కూడా ఉంది. దీంతో వారందరినీ కానిస్టేబుల్ స్టేషన్‌కి తీసుకెళ్లింది. పిల్లలందరికీ భోజనం పెట్టించారు. అయితే పసికందుకు పాలు మాత్రమే అవసరం ఉండడంతో బయటి నుంచి తెప్పించేందుకు ఆలస్యమైంది.

Crime News: గోతిలో ఏదో పాతిపెతినట్లు అందరికీ అనుమానం.. చివరకు పోలీసుల సమక్షంలో తవ్వి చూడగా షాకింగ్ సీన్..

police-women.jpg

మరోవైపు శిశువు ఏడుస్తూనే ఉండడంతో చివరకు మహిళా కానిస్టేబుల్ స్పందించింది. వెంటనే శిశువును ఎత్తుకుని పాలు ఇచ్చింది. పసికందును తల్లిలా లాలించడమే కాకుండా పాలు కూడా ఇవ్వడం చూసి అంతా కానిస్టేబుల్‌ను అభినందించారు. విచారణలో పిల్లల తండ్రి ఏదో కేసులో జైల్లో ఉన్నాడని, తల్లి ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది. దీంతో చివరకు పిల్లలందరినీ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాగా, పసికందుకు పాలు ఇచ్చిన కానిస్టేబుల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి మహిళా పోలీసులు చాలా అరుదుగా ఉంటారు’’.. అంటూ కొందరు, ‘‘తన పాలు ఇచ్చి పసికందు ఆకలి తీర్చడం గ్రేట్’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

wife: దుబాయ్‌లో పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసిన భార్య... భర్త అభ్యంతరం చెప్పడంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం..

Updated Date - 2023-11-26T19:48:13+05:30 IST