Share News

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..

ABN , First Publish Date - 2023-11-26T15:53:08+05:30 IST

దంపతుల మధ్య తలెత్తే గొడవలు చాలా వరకు త్వరగా సర్దుమణుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య తలెత్తే గొడవలు చాలా వరకు త్వరగా సర్దుమణుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఒడిశాలో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రి సమయంలో ఇంట్లో వదిలాడు. అయితే నెల రోజుల తర్వాత అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలోని (Odisha) గంజాం జిల్లా అధేగావ్ గ్రామానికి చెందిన గణేష్‌కు బసంతి అనే భార్య ఉంది. వీరికి 2020లో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఇదిలావుండగా, ఇటీవల ఈ దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు (Quarrels between couples) జరుగుతుండేవి. రోజురోజుకూ ఈ గొడవలు పెద్దవయ్యాయి. దీంతో గణేష్ తన భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో చివరకు ఏకంగా భార్యనే చంపేయాలని కుట్రపన్నాడు. అయితే పోలీసులకు దొరక్కుండా ఎలా చంపాలనే విషయంపై వివిధ రకాలుగా ఆలోచించాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చి అక్టోబర్ 6న సాపూర్ అనే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ పాములు పట్టే వారి వద్దకు వెళ్లి... తమ ఇంట్లో పూజ ఉందని చెప్పి ఓ నాగుపామును కొనుక్కున్నాడు. దాన్ని ఓ డబ్బాలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు.

Viral Video: ఎలా వస్తాయ్ సామీ ఇలాంటి ఐడియాలు.. బైక్ సాయంతో బావిలోంచి నీళ్లను ఎలా బయటకు తెస్తున్నారో చూస్తే..!

రాత్రి వేళ్ల ఇంట్లోకి వెళ్లి భార్య మంచంపై పడేసి తలుపులు వేశాడు. పాము కాటుతో అతడి భార్యతో (Mother and daughter died due to snake bite) పాటూ కూతురు కూడా చనిపోయారు. ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు వారిని చికిత్సం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో పాము కాటుతో చనిపోయినట్లు తెలియడంతో అంతా ప్రమాదవశాత్తు జరిగింది అనుకుని మిన్నకుండిపోయారు. చివరకు పోలీసులకు కూడా అలాగే అనుకుని కేసు క్లోజ్ చేశారు. అయితే ఇటీవల గణేష్ వ్యవహారంపై అనుమానం రావడంతో బలంతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతన్ని అదుపులోకి తీసుకుని, తమదైన స్టైల్లో విచారణ చేయగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఈ ప్రేమ జంట నిర్వాకానికి పానిపూరీ వ్యాపారికి మైండ్‌బ్లాక్.. ఖాళీ పూరీని ఆమె నోట్లో పెట్టుకుంటే..!

Updated Date - 2023-11-26T15:55:01+05:30 IST