Share News

Viral Video: ఎలా వస్తాయ్ సామీ ఇలాంటి ఐడియాలు.. బైక్ సాయంతో బావిలోంచి నీళ్లను ఎలా బయటకు తెస్తున్నారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-25T20:51:23+05:30 IST

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆలోచించకుండా కొందరు తమ ప్రతిభాపాటవాలతో ముందుకు వెళ్తుంటారు. మరికొందరు వినూత్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే...

Viral Video: ఎలా వస్తాయ్ సామీ ఇలాంటి ఐడియాలు.. బైక్ సాయంతో బావిలోంచి నీళ్లను ఎలా బయటకు తెస్తున్నారో చూస్తే..!

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆలోచించకుండా కొందరు తమ ప్రతిభాపాటవాలతో ముందుకు వెళ్తుంటారు. మరికొందరు వినూత్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. అందుబాటులో ఉన్న వస్తువులతోనే తమ సమస్యలకు సులభంగా పరిష్కారమార్గాలను వెతుక్కుంటుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బైక్ సాయంతో బావిలోని నీళ్లను బయటకు తీయడం చూసిన వారంతా.. ‘‘వారెవ్వా.. ఏం ఐడియా గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బావులు, చెరువుల్లోని నీటిని బయటికి తీయడానికి ఎవరైనా మోటార్లను వాడుతుంటారు. అయితే ఓ వ్యక్తి ఎలాంటి మోటారు, విద్యుత్ ఉపయోగించకుండా బావిలోని (Pumping out water without motor) నీటిని సునాయాసంగా బయటకు తీశాడు. ఇందుకోసం కేవలం ఒకే ఒక్క బైకును తీసుకున్నాడు. దాని ఇంజిన్ కింద వైపు ఓపెన్ చేసి, అక్కడ పైపును ఫిట్ చేస్తాడు. తర్వాత ఆ పైపును బావిలోని నీటిలోకి వేశాడు.

Snake Video: కొబ్బరి చెట్టులో ఇరుక్కుపోయిన నాగుపాము.. కొడవలితో కాపాడుతోంటే దానిలో పెరిగిన భయం.. చివరకు..!

ఫైనల్‌గా బైక్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే రివర్స్ పంపింగ్ ద్వారా బావిలోని నీరంతా పైపు గుండా బయటికి వస్తుంది. ఇలా తన పొలానికి ఈజీగా నీరు సరఫరా చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారెవ్వా.. ఏం ఐడియా గురూ’’.. అని కొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ప్రేమ జంట నిర్వాకానికి పానిపూరీ వ్యాపారికి మైండ్‌బ్లాక్.. ఖాళీ పూరీని ఆమె నోట్లో పెట్టుకుంటే..!

Updated Date - 2023-11-25T20:51:27+05:30 IST