Share News

wife: దుబాయ్‌లో పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసిన భార్య... భర్త అభ్యంతరం చెప్పడంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం..

ABN , First Publish Date - 2023-11-26T16:55:39+05:30 IST

పది మందిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు స్థాయికి మించి ఖర్చులు చేస్తుంటారు. చివరకు వారు ఇబ్బంది పడడమే కాకుండా కుటుంబ సభ్యులకూ సమస్యలు తెచ్చిపెడుతుంటారు. ప్రధానంగా దంపతుల మధ్య ఇలాంటి సమస్యలు ఎక్కవగా తలెత్తుతుంటాయి. తాజాగా...

wife: దుబాయ్‌లో పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసిన భార్య... భర్త అభ్యంతరం చెప్పడంతో చివరకు ఆమె చేసిన నిర్వాకం..
ప్రతీకాత్మక చిత్రం

పది మందిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు స్థాయికి మించి ఖర్చులు చేస్తుంటారు. చివరకు వారు ఇబ్బంది పడడమే కాకుండా కుటుంబ సభ్యులకూ సమస్యలు తెచ్చిపెడుతుంటారు. ప్రధానంగా దంపతుల మధ్య ఇలాంటి సమస్యలు ఎక్కవగా తలెత్తుతుంటాయి. తాజాగా, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో చేయాలని ఓ మహిళ తన భర్తను కోరింది. ఇందుకు అతను అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. చివరకు ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర (Maharashtra) పూణె పరిధి వాన్‌వాడి ప్రాంతంలో నిఖిల్ ఖన్నా అనే వ్యక్తి.. భార్య రేణుకతో కలిసి నివాసం ఉంటున్నాడు. నిఖిల్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పని చేస్తుంటాడు. దీంతో వారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో ఎంతో సంతోషంగా ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఇటీవల వీరి మధ్య ఊహించని సమస్య వచ్చి పడింది. సెప్టెంబర్ 18న రేణుక పుట్టిన రోజు ఉండడంతో ఘనంగా జరుపుకోవాలని భావించింది. తన పుట్టిన రోజు వేడుకలను (Birthday celebrations) దుబాయ్‌లో (Dubai) నిర్వహించాలని భర్తను కోరింది. అయితే ఇందుకు అతను అభ్యంతరం తెలిపాడు. దీంతో రేణుక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలావుండగా, నవంబర్ 5న వారి వివాహ వార్షికోత్సవం కావడంతో భర్తను ఖరీదైన బహుమతి కోరింది. ఢిల్లీలో జరుగుతున్న తన బంధువు పుట్టిన రోజు వేడుకలకు వెళ్లాలని కోరింది.

Viral Video: ఎలా వస్తాయ్ సామీ ఇలాంటి ఐడియాలు.. బైక్ సాయంతో బావిలోంచి నీళ్లను ఎలా బయటకు తెస్తున్నారో చూస్తే..!

అయితే ఢిల్లీ వెళ్లేందుకూ నిఖిల్ ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఈ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో గొడవ పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రేణుక.. (Wife assaults husband) భర్త ముక్కు మీద గట్టిగా కొట్టింది. తీవ్ర రక్తస్రావం అవడంతో అతను అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వీరి గొడవ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిఖిల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్యపై వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime news: పూజలు చేయాలంటూ పామును తీసుకొచ్చి రాత్రివేళ ఇంట్లో వదిలిన భర్త.. నెల రోజుల తర్వాత బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-11-26T16:55:40+05:30 IST