Share News

Bride Video: కుమిలి కుమిలి ఏడుస్తూనే.. అత్తారింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వధువు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-29T19:04:32+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు..

Bride Video: కుమిలి కుమిలి ఏడుస్తూనే.. అత్తారింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వధువు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వివాహ కార్యక్రమాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వధువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ వధువు కుమిలి కుమిలి ఏడుస్తూనే అత్తారింటికి బయలుదేరేందుకు ఆటో ఎక్కింది. అయితే కాసేపటి తర్వాత ఆమె ప్రవర్తన చూసి అంొతా ఖంగుతిన్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (wedding ceremony) చోటు చేసుకున్న ఘటన బంధువులందరితో పాటూ నెటిజన్లనూ షాక్‌కి గురి చేస్తోంది. సాధారణంగా ఏ వివాహంలోనైనా వధువు (bride) అప్పగింతల సమయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. కొందరైతే అత్తారింటికి వెళ్లేందుకు ఇష్టం లేక ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో తల్లిందండ్రులు, బంధువులంతా నచ్చజెప్పి పంపిస్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన వివాహంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వివాహానంతరం అత్తారింటికి వెళ్లేందుకు వధువు ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది.

Viral Video: స్వీట్ షాపులోంచి గులాబ్‌జామ్‌లు కొనుక్కుని వెళ్లాడో వ్యక్తి.. ఇంటికెళ్లి తిందామని ఓపెన్ చేసి చూస్తే..!

వధువు ఏడుస్తుండడంతో పక్కన ఉన్న మహిళలు ఓదారుస్తూ ఉంటారు. వధువు బాధపడడం చూసి అతిథులంతా మౌనంగా ఉంటారు. ‘‘బాధపడకమ్మా... మళ్లీ నాలుగు రోజుల్లో వచ్చెయ్’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటారు. ఈ సమయంలో వధువు ఉన్నట్టుండి గట్టిగా నవ్వుతూ అందరికీ షాక్ ఇస్తుంది. దీంతో అప్పటిదాకా ఆమె ఏడుపు మొత్తం నటన అని అందరికీ తెలిసిపోతుంది. దీంతో మిగతా వారంతా పగలబడి నవ్వుకుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు యాక్టింగ్ అదరగొడుతోందిగా’’.. అని కొందరు, ‘‘ఏడ్చే ఆడవారిని నమ్మకూడదు’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Woman: ప్రియుడి ఫోన్‌లో 13,000 అశ్లీల ఫొటోలు.. తనవే కాకుండా వేరే మహిళలవి కూడా ఉండటం చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

Updated Date - 2023-11-29T21:26:13+05:30 IST