Share News

Woman: ప్రియుడి ఫోన్‌లో 13,000 అశ్లీల ఫొటోలు.. తనవే కాకుండా వేరే మహిళలవి కూడా ఉండటం చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!

ABN , First Publish Date - 2023-11-29T17:35:12+05:30 IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేరాలకు పాల్పడుతుండగా.. మరికొందరు మహిళలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు వాడుకుంటున్నారు. తాజాగా...

Woman: ప్రియుడి ఫోన్‌లో 13,000 అశ్లీల ఫొటోలు.. తనవే కాకుండా వేరే మహిళలవి కూడా ఉండటం చూసి అవాక్కైన ప్రేయసి.. చివరకు..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నేరాలకు పాల్పడుతుండగా.. మరికొందరు మహిళలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు వాడుకుంటున్నారు. తాజాగా, బెంగళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి తన ప్రియుడి ఫోన్‌ను పరిశీలించగా.. అందులో తన ఫొటోలే కాకుండా వేరే మహిళలకు చెందిన 13,000 అశ్లీల ఫొటోలు ఉండడం చూసి షాక్ అయింది. చివరకు ఏం జరిగిందంటే..

బెంగళూరులోని (Bangalore) ఓ బీపీఓ సంస్థలో ఆదిత్య సంతోష్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతడికి రేఖ (పేరు మార్చాం) అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా (love) మారింది. అయితే ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునే సమయంలో సంతోష్ ఫొటోలు, వీడియోలు (Photos and videos) తీసుకుని దాచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం రేఖకు తెలిసింది. దీంతో చివరకు ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అతడి ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడు లేని సమయంలో ఫోన్ తీసుకుంది. అందులోని గ్యాలరీ తెరచి చూడగా.. లోపల తనతో పాటూ వేరే యువతులు, మహిళలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు ఉండడం చూసి షాక్ అయింది. దీంతో ఆమె ఈ విషయాన్ని వెంటనే కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.

Indian Railway: సచిన్ పేరుతో రైల్వే స్టేషన్.. సునీల్ గవాస్కర్ పోస్ట్.. అసలు ఇది ఎక్కడ ఉందో తెలుసా..?

కంపెనీ యాజమాన్యం ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌లో సుమారు 13,000 అశ్లీల ఫొటోలు ఉండడం చూసి అంతా ఖంగుతిన్నారు. వాటిలో కొన్ని ఫొటోలను మార్ఫింగ్ (morphing photos) చేయగా.. మరికొన్ని ఒరిజినల్ అని గుర్తించారు. అయితే ఇలా చేయడానికి అతను సంస్థకు సంబంధించిన ఏ పరికరాలనూ వినియోగించలేదని యాజమాన్యం తెలియజేసింది. అలాగే అతడిపై ఇప్పటి వరకూ వేరే మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదని కూడా తెలిసింది. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అశ్లీల ఫొటోలు చూపించి ఎవరినైనా బెదిరించాడా.. లేక ఈ ఫొటోలతో వేరే నేరాలకేమైనా పాల్పడుతున్నాడా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: స్వీట్ షాపులోంచి గులాబ్‌జామ్‌లు కొనుక్కుని వెళ్లాడో వ్యక్తి.. ఇంటికెళ్లి తిందామని ఓపెన్ చేసి చూస్తే..!

Updated Date - 2023-11-29T17:35:16+05:30 IST