Share News

Tiger vs Man: చెట్టెక్కిన యువకుడు.. చెట్టు కింద కాసుకుని కూర్చున్న పులి.. అర్ధరాత్రి కళ్లు మూతలు పడుతున్నా..!

ABN , First Publish Date - 2023-11-28T21:49:03+05:30 IST

మనుషులు కానీ, జంతువులు గానీ ఒక్కసారి.. సింహం, పులుల కంట పడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలు దక్కే అవకాశం ఉండదు. ఇలాంటి...

Tiger vs Man: చెట్టెక్కిన యువకుడు.. చెట్టు కింద కాసుకుని కూర్చున్న పులి.. అర్ధరాత్రి కళ్లు మూతలు పడుతున్నా..!
ప్రతీకాత్మక చిత్రం

మనుషులు కానీ, జంతువులు గానీ ఒక్కసారి.. సింహం, పులుల కంట పడితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రాణాలు దక్కే అవకాశం ఉండదు. ఇలాంటి అద్భుత ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అడవిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి ఎదురుగా పులి కనిపించింది. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో అతను సమీపంలో చెట్టు ఎక్కేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఉమారియా జిల్లా బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లోని (Tiger Reserve) ధమోకర్ బఫర్ జోన్ పరిధి ముద్గురి ఘఘదర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కమలేష్ సింగ్ అనే వ్యక్తి.. ఏదో పని మీద అడవి గుండా వెళ్తున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అడవి పందులను వెంబడిస్తూ వచ్చిన పులి.. కమలేష్ కంట పడింది. పులిని చూడగానే కమలేష్ గుండె ఆగిపోయినంత పనైంది. తప్పించుకోవడానికి (tiger attacked on man) ప్రయత్నిస్తుండగానే పులి దాడికి పాల్పడింది. అయితే దాని బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న కమలేష్.. సమీపంలోని చెట్టు ఎక్కేశాడు.

Marriage: పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ వరుడు ఇలా చేశాడేంటి..? వధువుకు అసలు విషయం తెలిసి..!

పులి కూడా అతడి కోసం చెట్టు కిందే పొంచి ఉంది. ఇంతలో చీకటి పడడంతో అటుగా ఎవరూ రాలేదు. మరోవైపు పులి చాలా సేపు చెట్టు వద్ద నుంచి పక్కకు వెళ్లలేదు. దీంతో కమలేష్ భయంతో వణికిపోతూ చెట్టుకు అతుక్కుపోయాడు. ఇలా రాత్రంతా చెట్టు పైనే ఉండాల్సి వచ్చింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు అతన్ని గుర్తించి రక్షించారు. గాయపడ్డ అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ గ్రామ అడవికి సమీపంలో ఉండడంతో తరచూ క్రూరమృగాలు సంచరిస్తుంటాయని స్థానికులు తెలిపారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఈ గుర్రంపై స్వారీ చేయడం అంత ఈజీ కాదు.. దీని ప్రత్యేకత, ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Updated Date - 2023-11-28T21:49:09+05:30 IST