Share News

Viral Video: స్వీట్ షాపులోంచి గులాబ్‌జామ్‌లు కొనుక్కుని వెళ్లాడో వ్యక్తి.. ఇంటికెళ్లి తిందామని ఓపెన్ చేసి చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-29T16:07:07+05:30 IST

పెద్ద పెద్ద హోటళ్లు, దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుంటారు. సమోసాల మధ్యలో చనిపోయిన బల్లులు, చికెన్ తిందామని చూస్తే అందులో చనిపోయిన ఎలుకలు కనిపించడం వంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా..

Viral Video: స్వీట్ షాపులోంచి గులాబ్‌జామ్‌లు కొనుక్కుని వెళ్లాడో వ్యక్తి.. ఇంటికెళ్లి తిందామని ఓపెన్ చేసి చూస్తే..!

పెద్ద పెద్ద హోటళ్లు, దుకాణాల్లో ఆహార పదార్థాల తయారీలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుంటారు. సమోసాల మధ్యలో చనిపోయిన బల్లులు, చికెన్ తిందామని చూస్తే అందులో చనిపోయిన ఎలుకలు కనిపించడం వంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా, తమిళనాడులో ఓ వ్యక్తి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్వీటు షాపు నుంచి గులాబ్‌జామ్‌లు కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఓపెన్ చేశాడు. అయితే అందులో కనిపించిన దృశ్యం చూసి ఖంగుతిన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడుకు (Tamil Nadu) కోయంబత్తూరుకు చెందిన ఓ ఫుడ్ బ్లాగర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇటీవల అతను చెన్నైలోని (Chennai) దుకాణం నుంచి స్వీట్లు తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను స్వీట్లలో గులాబ్‌జామ్‌లు (Gulab jamun) బయటకు తీసి ఓ పాత్రలో వేశాడు. అయితే గులాబ్‌జామ్‌లపై ఓ తెల్లటి పురుగు పాకుతుండడం చూసి అతను ఖంగుతిన్నాడు. అంత పెద్ద షాపులో కొన్న స్వీట్లలో కూడా ఇలా పురుగులు ఉండడం ఏంటని ఆశ్చర్య వ్యక్తం చేశాడు. వెంటనే వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Indian Railway: సచిన్ పేరుతో రైల్వే స్టేషన్.. సునీల్ గవాస్కర్ పోస్ట్.. అసలు ఇది ఎక్కడ ఉందో తెలుసా..?

తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని, కలలో కూడా ఊహించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్వీట్లలో ఇలాంటి పరుగులను చాలా సార్లు చూశాం’’.. అంటూ కొందరు, ‘‘అధికారులకు ఫిర్యాదు చేసి, నష్టపరిహారం రాబట్టాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 30వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Tiger vs Man: చెట్టెక్కిన యువకుడు.. చెట్టు కింద కాసుకుని కూర్చున్న పులి.. అర్ధరాత్రి కళ్లు మూతలు పడుతున్నా..!

Updated Date - 2023-11-29T16:07:13+05:30 IST