Share News

Viral Video: ఈ బుల్లి పిట్ట తెలివి అదుర్స్.. చుట్టూ మూడు పిల్లులు.. కదిలితే నమిలి తినేయడం గ్యారెంటీ అని గ్రహించి..!

ABN , First Publish Date - 2023-12-01T16:37:34+05:30 IST

కొన్నిసార్లు ప్రమాదాలు వెంట్రుకవాసిలో తప్పిపోతుంటాయి. మరికొన్నిసార్లు తెలివిగా వ్యవహిరంచడం వల్ల కూడా చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. పక్షులు, జంతువులు కూడా కొన్నిసార్లు తమ తెలివితేటలతో..

Viral Video: ఈ బుల్లి పిట్ట తెలివి అదుర్స్.. చుట్టూ మూడు పిల్లులు.. కదిలితే నమిలి తినేయడం గ్యారెంటీ అని గ్రహించి..!

కొన్నిసార్లు ప్రమాదాలు వెంట్రుకవాసిలో తప్పిపోతుంటాయి. మరికొన్నిసార్లు తెలివిగా వ్యవహిరంచడం వల్ల కూడా చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. పక్షులు, జంతువులు కూడా కొన్నిసార్లు తమ తెలివితేటలతో శత్రువుల నుంచి సులభంగా తప్పించుకోవడం చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ పిచ్చుకను మూడు పిల్లులు చుట్టుముట్టి ప్రాణాలు తీయబోయాయి. అయితే తెలివిగా వ్యవహరించిన పిచ్చుక చివరకు ఎలా తప్పించుకందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలోకి పిచ్చుక వచ్చి వాలుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మూడు పిల్లులు పిచ్చుకను గమనిస్తాయి. పిల్లులు దాడి (Cats Attack) నుంచి తప్పించుకునేందుకు పిచ్చుక (Clever sparrow) చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఒక్కసారిగా విగ్రహంలా మారిపోయి కదలకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో పిల్లులు దాని చుట్టూ తిరుగుతూ ‘‘ఇదేంటీ పిచ్చుకలా ఉందీ.. కానీ కదల్లేదు’’.. అని అనుమానంగా చూస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో పిచ్చుక దగ్గరకు వెళ్లి వాసన చూసి మరీ పరీక్షిస్తాయి. అయినా పిచ్చుక మాత్రం ఏమాత్రం కదలకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో చివరకు అది నిజంగా బొమ్మేమో అని పిల్లులు ఓ నిర్ణయానికి వస్తాయి.

Marriage: అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. బంధువులందరి ముందే అసలు నిజం చెప్పి..!

పిల్లులు అయోమయంలో ఉన్న సమయంలో అదును చూసి పిచ్చుక .. ‘‘వామ్మో! ఇక నా వల్ల కాదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్’’.. అనుకుంటూ తలను అటూ ఇటూ తిప్పి గాల్లోకి ఎగిరేందుకు సిద్ధమవుతుంది. దీంతో పిల్లులు షాకై పిచ్చుకపై దాడికి దిగుతాయి. అయితే పిచ్చుక ఎంతో చాకచక్యంగా వాటి నుంచి తప్పించుకుని గాల్లోకి దూసుకెళ్లిపోతుంది. దీంతో పిల్లలు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిచ్చుక భలే తెలివిగా చేసిందే’’.. అంటూ కొందరు, ‘‘పిట్టకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 మిలియన్ పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-12-01T16:37:36+05:30 IST