Share News

Viral Video: బండరాయి పైనుంచి కింద పడిపోతున్న కుర్రాడు.. కాపాడేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నాలు.. చివరకు ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-12-01T18:01:56+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నెట్టింట్లో కళ్లతో చూసిందంతా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నింటిని చూస్తే ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు...

Viral Video: బండరాయి పైనుంచి కింద పడిపోతున్న కుర్రాడు.. కాపాడేందుకు ఫ్రెండ్స్ ప్రయత్నాలు.. చివరకు ఏం జరిగిందంటే..!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నెట్టింట్లో కళ్లతో చూసిందంతా నిజం కాకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్నింటిని చూస్తే ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు వాటి వెనుక కెమెరామెన్ పనితనం అవాక్కయ్యేలా చేస్తుంటుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ కుర్రాడు బండరాయి పైనుంచి కిందపడిపోతుండగా.. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ఎత్తైన ఓ పెద్ద రాయి మీదకు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి బండ మీద నుంచి లోయలోకి జారిపతుండగా.. గమనించిన స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. చాలా సేపు ప్రయత్నించి అతన్ని పైకి లాగేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చూసేవారికి ఇలాంటి భ్రమ కలిగించేలా వారు నటించిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు. చివరగా అసలు విషయాన్ని తెలియజేస్తూ, వారిలో ఇద్దరు వ్యక్తులు.. వేళాడుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని మెల్లగా కిందకు దించారు.

Viral Video: ఈ బుల్లి పిట్ట తెలివి అదుర్స్.. చుట్టూ మూడు పిల్లులు.. కదిలితే నమిలి తినేయడం గ్యారెంటీ అని గ్రహించి..!

తీరా చివరకు చూస్తే బండ కింద ఎలాంటి లోయా లేదు. మెట్ల మార్గం పక్కనే పెద్ద బండరాయి ఉండడం, కెమెరా యాంగిల్ మార్చడం వల్ల కింద లోయ ఉన్నట్లు కనపడిందనే విషయం చివరకు తెలుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కెమెరామెన్ పనితనం అద్భుతం’’.. అని కొందరు, ‘‘యాక్టింగ్ చాలా బాగా చేశారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ ప్రదేశం చాలా బాగుంది.. అడ్రస్ చెప్పండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.. లోపలికి వెళ్లగానే భార్య చేసిన పనికి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-12-01T18:01:57+05:30 IST